![Rashid Khan Hillarious Reply To Fan Asking About His Marriage Viral - Sakshi](/styles/webp/s3/article_images/2021/06/5/rashid.jpg.webp?itok=Y6sjSm6N)
జలాలాబాద్: అఫ్ఘనిస్తాన్ స్టార్ ఆటగాడు రషీద్ ఖాన్ తన మనసులో ఏం ఉంటే దాన్ని నిర్భయంగా బయటికి చెప్పేస్తాడు. ఎదుటివారు ఏమన్నా అనుకుంటారనే మొహమాటం రషీద్‌కు అస్సలు ఉండదు. అలా ఉంటే అవతలి వారు మనల్ని హేళన చేసి మాట్లాడతారని చాలాసార్లు చెప్పుకొచ్చాడు. కానీ రషీద్ ఏం చేసినా ఫన్నీగానే అనిపిస్తుంది. ఈ 22 ఏళ్ల యువ స్పిన్నర్‌లో మంచి హ్యూమర్ ఉందని ఇప్పటికే చాలా ఇంటర్య్వూలో బహిర్గతమైంది. తాజాగా రషీద్ ఖాన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో సరదాగా చిట్‌చాట్ చేశాడు. ఈ సందర్భంగా రషీద్ పెళ్లి విషయమై ఒక అభిమాని ప్రశ్నవేశాడు. దానికి రషీద్ ఇచ్చిన సమాధానం నవ్వులు పూయిస్తుంది. ''రషీద్ బాయ్.. మీ పెళ్లెప్పుడు'' అని ఒక అభిమాని ప్రశ్నించాడు. దానికి రషీద్.. ''ఏందుకు మీరు వద్దామనుకుంటున్నారా'' అంటూ కామెంట్ చేశాడు.
కాగా క్రికెట్ ప్రపంచంలో తిరుగులేని స్పిన్నర్‌గా ఎదుగుతున్న స్పిన్నర్ రషీద్ ఖాన్ ఇటీవలే అఫ్ఘనిస్తాన్ టీ20 కెప్టెన్సీని తిరస్కరించాడు. ఈ ఏడాది భారత్ వేదికగా అక్టోబరు- నవంబరు టీ20 వరల్డ్‌కప్ జరగనుండగా.. ఈ మేరకు జట్టు సన్నద్ధతలో భాగంగా కెప్టెన్సీ బాధ్యతల్ని రషీద్ ఖాన్‌కి ఇవ్వాలని ఆఫ్గన్ క్రికెట్ బోర్డు ఆశించింది. కానీ.. 22 ఏళ్ల రషీద్ సున్నితంగా కెప్టెన్సీని తిరస్కరించినట్లు తెలుస్తోంది. దాంతో.. హస్మతుల్లా షాహిదిని అఫ్గానిస్థాన్ వన్డే, టెస్టు టీమ్ కెప్టెన్‌గా నియమించిన అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు.. టీ20 కెప్టెన్ ఎంపిక నిర్ణయాన్ని వాయిదా వేసింది. కాగా రషీద్ ఆఫ్గన్ తరపున 74 వన్డేల్లో 140, 51 టీ20ల్లో 95, 5 టెస్టుల్లో 34 వికెట్లు పడగొట్టాడు.
చదవండి: అమ్మ బాబోయ్.. వార్నర్ మళ్లీ ఇరగదీశాడు
బిర్యానీ కంటే ఎక్కువ ఇష్టపడతా.. సూర్యను ట్రోల్ చేసిన రషీద్
Comments
Please login to add a commentAdd a comment