అయ్యర్‌కు షాక్‌.. శాంసన్‌కు డబుల్‌ ప్రమోషన్‌! | Reports-Sanju Samson Challenge For Shreyas Iyer T20I Captaincy Claim | Sakshi
Sakshi News home page

అయ్యర్‌కు షాక్‌.. శాంసన్‌కు డబుల్‌ ప్రమోషన్‌!

May 9 2026 5:38 PM | Updated on May 9 2026 7:22 PM

Reports-Sanju Samson Challenge For Shreyas Iyer T20I Captaincy Claim

టీమిండియా టీ20 కెప్టెన్‌గా సూర్య‌కుమార్‌పై త్వ‌రలో వేటు ప‌డ‌నుంది. ఈ మేర‌కు బీసీసీఐ కొత్త టీ20 కెప్టెన్‌ను ఎంపిక చేసేందుకు ఇప్ప‌టికే క‌స‌ర‌త్తులు ప్రారంభించింది. అయితే శ్రేయ‌స్ అయ్య‌ర్ త‌దుప‌రి భార‌త టీ20 కెప్టెన్‌గా బాధ్య‌త‌లు తీసుకుంటాడంటూ వార్త‌లు వ‌స్తున్న వేళ.. తాజాగా కెప్టెన్సీ రేసులోకి అనూహ్యంగా సంజూ శాంస‌న్ పేరు తెరమీదకు రావడంతో పోటీ ఆస‌క్తిగా మారింది. 

ఎందుకంటే అయ్య‌ర్ కెప్టెన్ అయితే సంజూ శాంస‌న్ కెరీర్ ప్ర‌మాదంలో ప‌డుతుంద‌ని ఊహాగానాలు వ్య‌క్త‌మ‌యిన వేళ శాంస‌న్ ఏకంగా కెప్టెన్ కుర్చీపై క‌ర్చీఫ్ వేసి అయ్యర్‌కే ఎసరు పెట్టినట్లు తెలుస్తోంది. టీ20 కెప్టెన్సీ విష‌యంలో బీసీసీఐ అయ్య‌ర్‌కే అధిక ప్రాధన్య‌మిచ్చే అవ‌కాశ‌మున్న‌ప్ప‌టికీ శాంస‌న్ రేసులోకి వ‌స్తే అత‌డిని ప‌రిగణ‌లోకి తీసుకునే అవ‌కాశం లేక‌పోలేదు. 

దీంతో కెప్టెన్ కావాల‌నుకున్న అయ్య‌ర్‌కు ఇప్పుడు శాంస‌న్ రూపంలో పెద్ద గండం వ‌చ్చి ప‌డింది. ఐపీఎల్ 2026 సీజ‌న్‌కు ముందు రాజ‌స్తాన్ రాయ‌ల్స్ నుంచి సీఎస్‌కేకు ట్రేడింగ్ అయిన సంజూ శాంస‌న్ సూప‌ర్ ఫామ్ కొన‌సాగిస్తున్నాడు. ప్ర‌స్తుతం సీఎస్‌కేకు అత‌డు కెప్టెన్ కాక‌పోయిన‌ప్ప‌టికీ గతంలో రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌కు నాయ‌క‌త్వం వ‌హించిన అనుభ‌వం శాంస‌న్‌కు ఉప‌యోగ‌పడ‌నుంది. 

అనుభ‌వానికి తోడు కెప్టెన్‌గా రాజ‌స్తాన్‌ను విజ‌య‌వంతంగా న‌డిపించడమే శాంస‌న్‌ను కెప్టెన్సీ రేసులో నిల‌బెట్టిన‌ట్లు క‌నిపిస్తోంది. ఇక టీమిండియా వ‌చ్చే జూన్‌, జూలై నెల‌ల్లో ఇంగ్లండ్‌, ఐర్లాండ్‌లో వైట్‌బాల్ సిరీస్ ఆడ‌నుంది. ఈ ప‌ర్య‌ట‌న‌కు సంబంధించి ఆట‌గాళ్ల ఎంపిక ఐపీఎల్ ప్ర‌ద‌ర్శ‌న‌పైనే ఆధార‌ప‌డి ఉంటుంది. ముంబై బ్యాట‌ర్‌గా సూర్య‌కుమార్ దారుణ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తుండ‌డంతో అత‌డు చోటు కోల్పోయే అవ‌కాశ‌ముంది. ఇప్ప‌టికే ప‌రుగుల ప‌రంగా శాంస‌న్‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ టాప్ ప్లేస్ కోసం పోటీ ప‌డుతున్నారు.

శాంస‌న్ ఎందుకంటే?
భారత తదుపరి టీ20 కెప్టెన్‌గా సూర్యకుమార్ స్థానాన్ని భర్తీ చేసే రేసులో శాంసన్‌కు అనుకూలంగా ఉన్న అంశం ఏంటంటే.. అతను భారత టీ20 జట్టులో నిలకడగా ఉండటమే. 2024 టీ20 ప్రపంచ కప్ నుంచి జట్టుతో పాటు కొన‌సాగుతున్న శాంస‌న్ ఇప్ప‌టికే తానేంటో నిరూపించుకున్నాడు. 62 మ్యాచ్‌లాడి మూడు సెంచరీలు, ఆరు హాఫ్ సెంచరీలతో 1,399 పరుగులు సాధించాడు. 

ఈ ఏడాది ప్రారంభంలో భారత్ టీ20 ప్రపంచ కప్ విజయంలో కూడా అతను కీలక పాత్ర పోషించాడు. శ్రేయ‌స్ అయ్య‌ర్ ఐపీఎల్‌లో కెప్టెన్‌గా రాణిస్తున్న‌ప్ప‌టికీ అంత‌ర్జాతీయంగా టీమిండియా ఆడే టీ20 జ‌ట్టులో ఇప్ప‌టివ‌ర‌కు చోటు లేక‌పోవ‌డం మైన‌స్‌గా మారింది. అయ్య‌ర్‌ భారత్ తరఫున తన చివరి టీ20 మ్యాచ్‌ను 2023 డిసెంబర్ 3న ఆడాడు. 

ఒక‌వేళ అయ్య‌ర్ పొట్టి ఫార్మాట్‌లోకి రీఎంట్రీ ఇస్తే మాత్రం అత‌డికి బూస్ట‌ప్ అని చెప్పొచ్చు. దీనికి తోడు అత‌ను టీ20 కెప్టెన్ అయితే అత‌ని కెరీర్ గ్రాఫ్ కూడా పూర్తిగా మారిపోయే అవ‌కాశం ఉంది. ఐర్లాండ్, ఇంగ్లండ్ టీ20ల కోసం బీసీసీఐ సెలక్షన్ కమిటీ భార‌త టీ20 కెప్టెన్‌గా సూర్యకుమార్‌నే కొనసాగించే అవకాశం ఉందని, అయితే మరోసారి పేలవ ఫామ్ కనబరిస్తే మాత్రం సూర్య స్థానంలో బీసీసీఐ కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేయ‌నుంది.

చదవండి: చిక్కుల్లో జైస్వాల్‌, షఫాలీ.. నిషేధం పడే అవకాశం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement