టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పీడస్టర్ జస్‌ప్రీత్ బుమ్రా విషయంలో కీలక అప్‌డేట్ ఇచ్చాడు. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడం సంతోషం కలిగించదని పేర్కొన్న రోహిత్ బుమ్రా ఆడడంపై క్లారిటీ ఇచ్చాడు. మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో రోహిత్ మాట్లాడాడు.
''ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో బుమ్రా ఆడేది లేనిది కచ్చితంగా చెప్పలేం. అయితే తొలి రెండు టెస్టులకు మాత్రం బుమ్రా అందుబాటులో ఉండడు. నాకు తెలిసి చివరి రెండు టెస్టుల్లో అతను ఆడతాడనే నమ్మకముంది. ఇదే నిజమైతే మా జట్టు బౌలింగ్‌లో బలం పెరిగినట్లే. కీలకమైన ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్‌కు బుమ్రాను సన్నద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
అందుకే ఒకవేళ బుమ్రా పూర్తిస్థాయిలో కోలుకొని బరిలోకి దిగినప్పటికి వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ నేపథ్యంలో అతనిపై ఎక్కువ ఒత్తడి పెట్టొద్దని అనుకుంటున్నాం. బుమ్రా విషయంలో ఫిజియోలతో ఎన్‌సీఏ డాక్టర్లతో రెగ్యులర్ టచ్‌లో ఉన్నాం. బుమ్రా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం. మెడికల్ టీం అతను కోలుకోవడానికి వీలైనంత ఎక్కువ టైమ్ కేటాయించేలా జట్టు సహకరిస్తుంది.'' అంటూ చెప్పుకొచ్చాడు.
ఇక టీమిండియా న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన ఉత్సాహంతో టి20 సిరీస్‌ను ఆడనుంది. కివీస్‌తో మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్ ముగిసిన వారం వ్యవధిలోనే ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ఆడనుంది. ఫిబ్రవరి 9న ఇరుజట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ మొదలుకానుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్(2021-23) ఫైనల్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే.
బోర్డర్ గావస్కర్ ట్రోపీని టీమిండియా కైవసం చేసుకుంటే టెస్టుల్లో నెంబర్‌వన్ ర్యాంక్‌తో పాటు అగ్రస్థానానికి దూసుకెళ్లే అవకాశం ఉంది. అంతేకాదు ఆస్ట్రేలియాతో వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ ఆడే అవకాశం కూడా ఉంటుంది. ఇక టెస్టు సిరీస్ ముగిసిన అనంతరం ఆస్ట్రేలియాతో మూడు వన్డేలు ఆడనుంది. వన్డే వరల్డ్‌కప్ నేపథ్యంలో టీమిండియాకు ఇది కీలకమైన సిరీస్. ఇక 2023 వన్డే వరల్డ్‌కప్‌కు భారత్‌కు ఆతిథ్యమివ్వనున్న సంగతి తెలిసిందే.
చదవండి: Shubman Gill: 'చాలా క్లిష్టమైన ప్రశ్న.. కోహ్లికే నా ఓటు'
Comments
Please login to add a commentAdd a comment