IPL 2022: Rohit Sharma, Jasprit Bumrah Join MI Camp Video Viral - Sakshi
Sakshi News home page

IPL 2022: ముంబై జట్టుతో చేరిన రోహిత్‌, బుమ్రా.. వీడియో వైరల్‌

Published Tue, Mar 15 2022 6:36 PM | Last Updated on Tue, Mar 15 2022 8:10 PM

Rohit Sharma, Jasprit Bumrah join MI camp - Sakshi

ఐపీఎల్‌లో తిరుగులేని కెప్టెన్‌గా రికార్డు సాధించిన రోహిత్‌ శర్మ ముంబై ఇండియన్స్‌ జట్టుతో చేరాడు. అతడితో పాటు స్టార్‌ బౌలర్‌ జస్ప్రీత్ బుమ్రా కూడా ముంబై క్యాంప్‌లో చేరాడు. బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరిగిన పింక్‌బాల్‌ టెస్టులో భారత్‌ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే మ్యాచ్‌ ముగిసిన అనంతరం వీరిద్దరూ ముంబైలో జట్టు బ‌స చేస్తున్న హోట‌ల్‌కు చేరుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను ముంబై ఇండియన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ఈ వీడియోలో రోహిత్‌, బుమ్రా హోటల్‌లోకి ప్రవేశిస్తున్నట్లు  కనిపించారు. అదే విధంగా ముంబై ఇండియ‌న్స్ ఇప్ప‌టివ‌ర‌కు గెలిచిన 5 ట్రోఫీలను సందర్శనకు ఉంచారు. ఇక బుమ్రా ఒంటరిగా రాగా, రోహిత్‌ తన ఫ్యామిలీతో పాటు వచ్చాడు. అతడి వెంట తన భార్య, కుమార్తె సమైరా ఉంది. ఇక ఐపీఎల్‌-2022 మార్చి 26 నుంచి ప్రారంభం కానుంది. వాంఖడే వేదికగా జరగనున్న తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌తో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తల పడనుంది. ఇక ముంబై తమ తొలి మ్యాచ్‌లో మార్చి 27న ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో త‌ల‌ప‌డ‌నుంది. కాగా రోహిత్‌ సారథ్యంలో తొలి టెస్ట్‌ సిరీస్‌ను టీమిండియా కైవసం చేసుకుంది.

చదవండి: IPL 2022 -Rajasthan Royals: క్వారంటైన్‌ పూర్తి కానివ్వండి.. అప్పుడు ఏం చేయాలో అది చేద్దాం: చహల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement