టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి భారత జట్టు కెప్టెన్‌గా రోహిత్ 100 మ్యాచ్‌లను పూర్తి చేసుకున్నాడు. వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా లక్నో వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రోహిత్ ఈ ఘనతను అందుకున్నాడు.
రోహిత్ తన కెరీర్‌లో అత్యధికంగా 51 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ల్లో భారత జట్టుకు నాయకత్వం వహించాడు. ఆ తర్వాత 40 వన్డే మ్యాచ్‌ల్లో, 9 టెస్టు మ్యాచ్‌ల్లో రోహిత్ టీమిండియాకు కెప్టెన్సీ చేశాడు.
ఏడో కెప్టెన్‌గా..
కాగా ఈ అరుదైన ఘనత సాధించిన ఏడో ఇండియన్ కెప్టెన్‌గా రోహిత్ రికార్డులకెక్కాడు. ఈ జాబితాలో మాజీ కెప్టెన్లు మహేంద్ర సింగ్ ధోని(332 మ్యాచ్‌లు), మహ్మద్ అజారుద్దీన్(221 మ్యాచ్‌లు), విరాట్ కోహ్లి(213 మ్యాచ్‌లు), సౌరవ్ గంగూలీ(196 మ్యాచ్‌లు), కపిల్ దేవ్(108 మ్యాచ్‌లు), రాహుల్ ద్రవిడ్(104 మ్యాచ్‌లు) ఉన్నారు.
ఒక కెప్టెన్‌గా 100 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న రోహిత్‌ను బీసీసీఐ అభినందనలు తెలిపింది. రోహిత్‌కు ఇది స్పెషల్ సెంచరీ. భారత కెప్టెన్‌గా తన 100 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న రోహిత్ శర్మకు అభినందనలు అంటూ బీసీసీఐ ఎక్స్(ట్విటర్)లో రాసుకొచ్చింది.
చదవండి: రచిన్ రవీంద్ర అరుదైన రికార్డు.. ప్రపంచకప్ చరిత్రలో సచిన్ తర్వాత అతడే
A special TON! 💯
— BCCI (@BCCI) October 29, 2023
Congratulations to #TeamIndia skipper Rohit Sharma who is all set to play his 1⃣0⃣0⃣th international match as a Captain 👏👏 #TeamIndia | #CWC23 | #MenInBlue | #INDvENG pic.twitter.com/WqX3rDuddk
Comments
Please login to add a commentAdd a comment