డొమినికా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0 అధిక్యంలోకి దూసుకెళ్లింది.
ఇక ఇది ఇలా ఉండగా.. తన అరంగేట్ర టెస్టు మ్యాచ్‌లో టీమిండియా యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ తీవ్ర నిరాశపరిచాడు. కెఎస్ భరత్ స్ధానంలో జట్టులోకి వచ్చిన కిషన్.. వికెట్ల వెనుక ఈజీ క్యాచ్‌లు అందుకోవడంలో విఫలమయ్యాడు. అయితే వికెట్ కీపింగ్‌లోనే కాకుండా బ్యాటింగ్‌లో కూడా అదే తీరును కనబరిచాడు.
రోహిత్ సీరియస్..
ఇక భారత జట్టు మెనెజ్‌మెంట్ తమ తొలి ఇన్నింగ్స్‌ను విరాట్ కోహ్లి(76) ఔటైన వెంటనే డిక్లేర్ చేయాలని ఆలోచించినట్లు తెలుస్తోంది. కానీ తొలి మ్యాచ్ ఆడుతున్న ఇషాన్ కిషన్‌కు బ్యాటింగ్ చేసే అవకాశం ఇవ్వాలని కెప్టెన్ రోహిత్ శర్మ భావించాడు. ఈ క్రమంలో కోహ్లి ఔటైన వెంటనే కిషన్ బ్యాటింగ్‌కు వచ్చాడు.
ఏడో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన కిషన్.. విండీస్ బౌలర్లను ఎదుర్కొవడానికి తీవ్ర ఇబ్బంది పడ్డాడు. సింగిల్ రన్ తీయడానికి కిషన్‌కు 20 బంతులు అవసరమయ్యాయి. దీంతో డగౌట్‌లో రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్‌పై అసహనం వ్యక్తం చేశాడుఇక కిషన్ సింగిల్ చేసిన వెంటనే భారత ఇన్నింగ్స్‌ను ఇన్నింగ్స్‌ను రోహిత్ శర్మ డిక్లేర్ చేశాడు. . ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
చదవండి: అతడొక అద్భుతం.. కొంచెం కూడా భయపడలేదు! ఏదో వందో టెస్టు ఆడుతున్నట్లు: రోహిత్ శర్మ
— Nihari Korma (@NihariVsKorma) July 15, 2023
Comments
Please login to add a commentAdd a comment