
ట్రినిడాడ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. తన కెరీర్‌లో తొలి టెస్టు సిరీస్ ఆడుతున్న కిషన్.. తన ఆట తీరుతో అందరిని అకట్టుకున్నాడు. విండీస్‌తో రెండో టెస్టు సెకెండ్ ఇన్నింగ్స్‌లో కిషాన్ తుపాన్ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 33 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. తద్వారా టెస్టుల్లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ సాధించిన రెండో భారత వికెట్ కీపర్‌గా ఈ జార్ఖండ్ డైన్‌మెట్ నిలిచాడు.
జైశ్వాల్ ఔటైన తర్వాత కోహ్లి స్ధానంలో బ్యాటింగ్ వచ్చిన కిషన్.. 34 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 52 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు రోహిత్ శర్మ(57), జైశ్వాల్(38) పరుగులతో రాణించారు. 181/2 పరుగుల వద్ద తమ రెండో ఇన్నింగ్స్‌ను భారత్ డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో దక్కిన ఆధిక్యంతో కలిపి వెస్టిండీస్ ముందు 365 పరుగుల భారీ లక్ష్యం నిలిపింది.
సంతోషంలో హిట్‌మ్యాన్
ఇక ఈ మ్యాచ్‌లో కిషన్ సూపర్ ఇన్నింగ్స్ పట్ల టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సంతోషం వ్యక్తం చేశాడు. డ్రెస్సింగ్ రూమ్ నుంచి కిషన్ బ్యాటింగ్ చూస్తూ హిట్‌మ్యాన్ ఎంజాయ్ చేశాడు. కిషన్ తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకోగానే భారత ఇన్నింగ్స్‌ను రోహిత్ డిక్లేర్ చేశాడు. అయితే అంతకుముందు తొలి టెస్టులో కిషన్ బ్యాటింగ్‌పై రోహిత్ అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
తొలి టెస్టుతో అరంగేట్రం చేసిన కిషన్.. తన మొదటి పరుగు సాధించడానికి ఏకంగా 20 బంతులు తీసుకున్నాడు. ఈ క్రమంలో కిషన్ ఇన్నింగ్స్‌తో హిట్‌మ్యాన్ విసుగు చెందాడు. కిషన్ సింగిల్ సాధించగానే రోహిత్ టీమిండియా ఇన్నింగ్స్‌ను డిక్లెర్ చేశాడు. ఇప్పుడు రెండో టెస్టులో కూడా ఇదే పరిస్ధితి. కానీ ఈసారి రోహిత్ ముఖంలో కోపం కన్పించలేదు, నవ్వు కన్పించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
చదవండి: IND Vs WI: చరిత్ర సృష్టించిన టీమిండియా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా! ఇంగ్లండ్‌కు కూడా సాధ్యం కాలేదు
Rohit Sharma's reaction when Ishan Kishan made his maiden Test fifty.
— Vishal. (@SPORTYVISHAL) July 23, 2023
Captain @ImRo45's love for the youngsters is pure and incomparable. pic.twitter.com/iwKEDGwV8C