హైదరాబాద్ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టుకు సర్వం సిద్దమైంది. జనవరి 25(గురువారం) నుంచి మొదటి టెస్టు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే భాగ్యనగరానికి చేరుకున్న ఇరు జట్లు నెట్స్ ప్రాక్టీస్‌లో మునిగి తేలుతున్నాయి. ఇంగ్లండ్ బజ్‌బాల్‌ను అడ్డుకునేందుకు రోహిత్ సేన అన్ని విధాల సన్నదమవుతోంది.
అయితే సొంత గడ్డపై టెస్టుల్లో ఇంగ్లండ్‌పై భారత్‌కు ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. గత 12 ఏళ్లలో స్వదేశంలో ఇంగ్లండ్‌తో ఒక్కసారి కూడా టీమిండియా టెస్టు సిరీస్ కోల్పోలేదు. దీంతో మరోసారి టీమిండియానే హాట్ ఫేవరెట్‌గా కన్పిస్తోంది. ఇంగ్లండ్ చివరగా 2012 భారత్ గడ్డపై టెస్టు సిరీస్ సొంతం చేసుకుంది.
ఇక తొలి టెస్టు నేపథ్యంలో విలేకరుల సమావేశంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పాల్గోనున్నాడు. గతంలో తమ రికార్డులు అద్బుతంగా ఉన్నప్పటికీ, ఇంగ్లండ్‌ను మాత్రం తక్కువగా అంచనా వేయలేమని రోహిత్ తెలిపాడు.
"స్వదేశంలో అన్ని మ్యాచ్‌ల్లో విజయం సాధిస్తామని హామీ ఇవ్వలేను. ఎందుకంటే కొన్ని మ్యాచ్‌ల్లో ఓడిపోవచ్చు కూడా. ఆటలో గెలుపు ఓటములు సహాజం. అయితే గత దశాబ్ద కాలంగా ఇండియాలో ఇంగ్లండ్‌పై మాకు మంచి రికార్డు ఉంది. ఏదేమైనప్పటికీ మా గత రికార్డులను మేము పరిగణలోకి తీసుకోలేము. వరల్డ్ టెస్టు క్రికెట్‌లో అత్యుత్తమ జట్లలో ఇంగ్లండ్ ఒకటి. ఈ సిరీస్‌ను గెలవాలంటే జట్టు మొత్తం సమిష్టిగా రాణించాలని" ప్రీ మ్యాచ్ కాన్ఫరెన్స్‌లో రోహిత్ పేర్కొన్నాడు.
ఇక ఇంగ్లండ్ బజ్‌బాల్ గురించి హిట్‌మ్యాన్ మాట్లాడుతూ.. "ప్రత్యర్ది జట్లు ఎలా ఎలా ఆడుతున్నారనే దానిపై నాకు ఆసక్తి లేదు. మైదానంలో మేము ఎలా ఆడుతామన్నదే ముఖ్యం. ప్రస్తుతం ఒక జట్టుగా ఏమి చేయాలి అనే దానిపై మా దృష్టింతా ఉంది. మా బాయ్స్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. దక్షిణాఫ్రికా పర్యటనలో కూడా మంచి క్రికెట్ ఆడారు.
ఇక జట్టులో ప్రస్తుతం శ్రీకర్ భరత్, దృవ్ జురల్ రూపంలో ఇద్దరు వికెట్ కీపర్లు ఉన్నారు. వారి ప్రదర్శన ఆధారంగా అవకాశాలు ఇస్తాం. ఈ సిరీస్‌లో ఇద్దరికి కచ్చితంగా ఛాన్స్ ఇస్తాం. ఇక తొలి రెండు తొలి రెండు టెస్టుల్లో విరాట్ లేకపోవడం మాకు లోటే అని చెప్పుకొచ్చాడు.
చదవండి: #PCB Chairman: పాక్ క్రికెట్‌లో కీలక పరిణామం.. చైర్మెన్‌గా సుప్రీంకోర్టు న్యాయవాది
Comments
Please login to add a commentAdd a comment