Rohit Sharma Spotted Getting Into A Cab Today After ICC Press Meet, Video Goes Viral - Sakshi
Sakshi News home page

రోహిత్‌ శర్మ సింప్లిసిటీ.. సాధారణ వ్యక్తిలా క్యాబ్‌లో..!

Published Sat, Oct 15 2022 4:36 PM | Last Updated on Sat, Oct 15 2022 8:09 PM

Rohit Sharma Spotted Getting Into A Cab Today After ICC Event - Sakshi

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మరోసారి తన సింప్లిసిటీని ప్రూవ్‌ చేసుకున్నాడు. ఇవాళ జరిగిన ఐసీసీ సమావేశానికి హాజరైన అనంతరం అతను.. సాధారణ వ్యక్తిలా క్యాబ్‌లో హోటల్‌కు తిరుగు ప్రయాణమయ్యాడు. టీ షర్ట్‌, షార్ట్‌లో సింపుల్‌గా కనిపించిన హిట్‌మ్యాన్‌.. స్వయంగా కారు డిక్కీ ఓపెన్‌ చేసి లగేజ్‌ను అందులో పెట్టుకున్నాడు. ఈ సన్నివేశాలను అస్ట్రేలియాకు చెందిన ఓ జర్నలిస్ట్‌ షూట్‌ చేసి ట్విటర్‌లో పోస్ట్‌ చేయగా ప్రస్తుతం వైరలవుతుంది. సింపుల్‌ మ్యాన్‌ హిట్‌మ్యాన్‌ అంటు అభిమానులు కామెంట్‌లు పెడుతున్నారు. 

కాగా,ప్రపంచ కప్‌లో పోటీ పడే 16 దేశాల కెప్టెన్లతో ఐసీసీ ఇవాళ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా హాజరయ్యాడు. ఇందులో హిట్‌మ్యాన్‌ టీమిండియా జెర్సీ ధరించి ఫోటో షూట్‌లో పాల్గొన్నాడు. ఇదిలా ఉంటే, టీ20 వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లు ఆదివారం (అక్టోబర్‌ 16) నుంచి ప్రారంభమవుతాయి. తొలి వారమంతా (అక్టోబర్‌ 21 వరకు) క్వాలిఫికేషన్ రౌండ్ మ్యాచ్‌లు జరుగుతాయి. 23 నుంచి సూపర్ 12 రౌండ్ మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి. అక్టోబర్‌ 23న భారత్‌.. దాయాది పాకిస్థాన్‌తో తలపడుతుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement