
Courtesy: IPL Twitter
అబుదాబి: స్లో ఓవర్‌రేట్ కారణంగా రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ సామ్సన్‌కు మరోసారి భారీ జరిమానా పడింది. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో 20 ఓవర్ల కోటాను నిర్ణీత సమయంలో పూర్తి చేయనందుకు అతడిపై రూ. 24 లక్షల జరిమానా విధిస్తున్నట్లు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ప్రకటించింది. టీమ్ సభ్యులకు మ్యాచ్ ఫీజులో 25 శాతం లేదా రూ. 6 లక్షల (ఏది తక్కువైతే అది) కోతను విధించారు.
పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ సామ్సన్ స్లో ఓవర్‌రేట్ కారణంగా తొలిసారి ఫైన్‌ను ఎదుర్కొన్నాడు. కాగా రాజస్తాన్ రాయల్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన ఢిల్లీ 33 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా పాయింట్ల పట్టికలో మళ్లీ అగ్రస్థానానికి చేరుకొని ప్లే ఆఫ్స్‌కు చేరువైంది.
చదవండి: Sanju Samson: టార్గెట్ చేధిస్తాం అనుకున్నా.. ఓడిపోవడం బాధగా ఉంది