IPL 2021: RR Captain Sanju Samson Fined INR 12 Lakh For This Reason - Sakshi
Sakshi News home page

Sanju Samson: గెలుపుతో జోరు మీదున్న రాజస్తాన్‌కు ఎదురుదెబ్బ!

Published Wed, Sep 22 2021 10:39 AM | Last Updated on Wed, Sep 22 2021 6:24 PM

IPL 2021: RR Captain Sanju Samson Fined INR 12 Lakh For This Reason - Sakshi

Photo Courtesy: Rajasthan Royals Twitter

Rajasthan Royals Beat Punjab Kings By 2 Runs: పంజాబ్‌ కింగ్స్‌పై విజయంతో జోరు మీదున్న రాజస్తాన్‌ రాయల్స్‌కు ఎదురుదెబ్బ తగిలింది. స్లో ఓవర్‌ రేటు కారణంగా ఆ జట్టు కెప్టెన్‌ సంజూ శాంసన్‌కు 12 లక్షల జరిమానా విధించారు. కనీస ఓవర్‌రేటు మెయింటెన్‌ చేయని కారణంగా ఈ మేరకు ఫైన్‌ వేశారు. ఇందుకు సంబంధించి.. ‘‘వివో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఐపీఎల్‌-2021లో పంజాబ్‌ కింగ్స్‌తో సెప్టెంబరు 21న దుబాయ్‌లోని దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్‌ రేటు కారణంగా రాజస్తాన్‌ రాయల్స్‌ జట్టు సంజూ శాంసన్‌కు జరిమానా విధించబడింది. ఈ సీజన్‌లో ఇదే వారి తొలి తప్పిదం. కాబట్టి శాంసన్‌కు 12 లక్షల జరిమానాతో సరిపెడుతున్నాం’’ అని ఐపీఎల్‌ ఒక ప్రకటనలో పేర్కొంది.

అదే తప్పు పునరావృతమైతే..
ఐపీఎల్‌ మార్గదర్శకాల ప్రకారం, మొదటిసారి ఓవర్‌ రేటు నిబంధనలు ఉల్లంఘిస్తే సదరు జట్టు కెప్టెన్‌కు రూ. 12 లక్షలు, అదే తప్పు పునరావృతం చేస్తే రూ. 24 లక్షలు, తుదిజట్టులోని ప్రతీ ఆటగాడి మ్యాచ్‌ ఫీజులో 25 శాతం కోత పడుతుంది. ఇక మూడోసారి కూడా అదే జరిగితే, కెప్టెన్‌కు రూ. 30 లక్షల జరిమానాతో పాటు, ఒక మ్యాచ్‌లో నిషేధం, తుదిజట్టులోని ఆటగాళ్లకు రూ. 12 లక్షల జరిమానా, లేదంటే మ్యాచ్‌ ఫీజులో 50 శాతం కోత విధిస్తారన్న సంగతి తెలిసిందే.

ఇక మ్యాచ్‌ విషయానికొస్తే.. మంగళవారం నాటి మ్యాచ్‌లో పంజాబ్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో రాజస్తాన్‌ 2 పరుగులతో తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. తద్వారా ఐపీఎల్‌-2021 రెండో అంచెలో తమ తొలి గెలుపు నమోదు చేసింది. 

చదవండి: Shoaib Akhtar: ‘ముందు టీమిండియా.. ఆ తర్వాత న్యూజిలాండ్‌.. వదిలిపెట్టొద్దు’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement