ఆసియాకప్-2022లో భాగంగా టీమిండియాతో తొలి మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్ గట్టి ఎదుదెబ్బ తగిలే అవకాశంఉంది. ఆ జట్టు స్టార్ పేసర్ షాహీన్ షా ఆఫ్రిది గాయం కారణంగా భారత్‌తో జరిగే మ్యాచ్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. షాహీన్ షా ఆఫ్రిది ప్రస్తుతం మోకాలి గాయంతో బాధపడతున్నాడు. దీంతో అతడు త్వరలో నెదర్లాండ్స్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు కూడా దూరమయ్యాడు. నెదర్లాండ్స్ పర్యటనకు ముందు విలేకరుల సమావేశంలో మాట్లాడిన పాక్ కెప్టెన్ బాబర్ ఆజం ఆఫ్రిది గాయంపై అప్‌డేట్ ఇచ్చాడు.
ఆఫ్రిది మోకాలి నొప్పితో బాధపడుతున్నాడని, ప్రస్తుతం ఫిట్‌గా లేడని బాబర్ తెలిపాడు. "షాహీన్ మాతో పాటు నెదర్లాండ్స్‌కు రానున్నాడు. కానీ అతడికి ఈ సిరీస్‌కు మేము విశ్రాంతి ఇవ్వాలి అనుకుంటున్నాము. అతడికి ప్రస్తుతం ఎక్కువ విశ్రాంతి అవసరం. షాహీన్‌ను పర్యవేక్షించడానికి మేము ఇద్దరు వైద్యులను మాతో పాటు తీసుకెళ్తున్నాము. అతడు తన మోకాలి గాయం నుంచి కోలుకోవడానికి మరి కొంత సమయం పడుతుంది. షాహీన్ త్వరగా గాయం నుంచి కోలుకుని ఆసియా కప్‌కు ముందు తిరిగి జట్టులో చేరుతాడని ఆశిస్తున్నాము "అని బాబార్ పేర్కొన్నాడు.
కాగా షాహీన్ షా ఆఫ్రిది ప్రస్తుతం పాక్ జట్టులో కీలక బౌలర్‌గా ఉన్నాడు. గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌తో మ్యాచ్‌లో మూడు కీలక వికెట్లు పడగొట్టి ఆఫ్రిది తన సత్తా చాటాడు. ఒక వేళ టీమిండియాతో జరిగే తొలి మ్యాచ్‌కు ఆఫ్రిది దూరమైతే పాక్ గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పుకోవాలి. ఇక ఆసియా కప్ యూఏఈ వేదికగా ఆగస్టు 27 నుంచి ప్రారంభం కానుంది. కాగా భారత్- పాక్ మధ్య తొలి మ్యాచ్ ఆగస్టు 28న దుబాయ్ వేదికగా జరగనుంది.
ఆసియా కప్‌కు పాక్ జట్టు
బాబర్ ఆజం (కెప్టెన్), షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), ఆసిఫ్ అలీ, ఫఖర్ జమాన్, హైదర్ అలీ, హరీస్ రవూఫ్, ఇఫ్తీకర్ అహ్మద్, ఖుష్దిల్ షా, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ వసీం జూనియర్, నసీమ్ షా, షాహీన్ షా అఫ్రిది, షాహనావాజ్ ఆఫ్రిది దహానీ ఉస్మాన్ ఖదీర్
చదవండి: Asia Cup 2022- Ind Vs Pak: రోహిత్ పుల్ షాట్లు.. కోహ్లి క్లాసిక్ డ్రైవ్స్.. అదిరిపోయిన ప్రోమో!
Comments
Please login to add a commentAdd a comment