టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ ఇప్పటిలో రీ ఎంట్రీ ఇచ్చేలా కన్పించడం లేదు. ప్రస్తుతం నేషనల్ క్రికెట్ ఆకాడమీలో ఉన్న మహ్మద్ షమీ తాజాగా మోకాలి గాయం బారిన పడినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఆరంభంలో తన కాలి మడమకు శస్త్ర చికిత్స చేయించుకున్న షమీ.. తిరిగి ఫిట్‌నెస్ సాధించేందుకు ఎన్సీఏలో చేరాడు.
అయితే ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తుండగా మోకాళ్లలో వాపు ఏర్పడినట్లు సమాచారం. దీంతో అతడు పునరాగమనం మరింత ఆసల్యం కానుంది. ఈ గాయం కారణంగా అతడు దాదాపు 6-8 వారాల ఆటకు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో షమీ స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు దూరమైనట్లే. అంతేకాకుండా కివీస్‌తో టెస్టు సిరీస్ తర్వాత భారత జట్టు ఆసీస్ పర్యటనకు వెళ్లనుంది. ఈ సిరీస్‌కు కూడా షమీ అందుబాటులో ఉండేది అనుమానమే.
"షమీ తన బౌలింగ్ ప్రాక్టీస్ ప్రారంభించాడు. అతడు త్వరలోనే తిరిగి మైదానంలో అడుగుపెట్టనున్నాడు. అయితే దురదృష్టవశాత్తూ అతడి మోకాలి గాయం తీవ్రమైంది. ప్రస్తుతం అతడు బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడు. అతడు కోలుకోవడానికి కాస్త సమయం పడుతోంది"అని ఓ బీసీసీఐ అధికారి పేర్కొన్నారు. కాగా గతేడాది వన్డే వరల్డ్‌కప్ తర్వాత షమీ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.
Comments
Please login to add a commentAdd a comment