ప్రపంచ రికార్డు... అయినా పతకానికి దూరం  | Shooting World Cup: Rhythm Sangwan Breaks World Record, Missed Medal In Baku | Sakshi
Sakshi News home page

Shooting World Cup: ప్రపంచ రికార్డు... అయినా పతకానికి దూరం 

Published Sun, May 14 2023 7:18 AM | Last Updated on Sun, May 14 2023 7:18 AM

Shooting World Cup: Rhythm Sangwan Breaks World Record, Missed Medal In Baku - Sakshi

ప్రపంచ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్‌ రిథమ్‌ సాంగ్వాన్‌ కొత్త ప్రపంచ రికార్డును సృష్టించింది. అజర్‌బైజాన్‌లోని బాకులో జరుగుతున్న ఈ పోటీల్లో మహిళల 25 మీటర్ల పిస్టల్‌ ఈవెంట్‌లో రిథమ్‌ 595 పాయింట్లు స్కోరు సాధించి రికార్డును నమోదు చేసింది. అయితే ఈ పోటీల క్వాలిఫయింగ్‌ ఈవెంట్‌లో ఆమె ఈ కొత్త ఘనతను ప్రదర్శించింది. రికార్డు స్కోరుతో ఫైనల్‌ చేరిన రిథమ్‌ అసలు సమరంలో మాత్రం విఫలమైంది.

సత్తా చాటలేకపోయిన ఆమె చివరగా ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకుంది. ఇదే ఈవెంట్‌ క్వాలిఫయింగ్‌ ఇతర భారత షూటర్లు ఇషాసింగ్, మను భాకర్‌ వరుసగా 13వ, 27వ స్థానాల్లో నిలిచి ఆరంభంలోనే ని్రష్కమించారు. పురుషుల 50 మీటర్ల 3 పొజిషన్‌ రైఫిల్‌ ఈవెంట్‌లో కూడా భారత షూటర్లెవరూ ఫైనల్స్‌కు అర్హత సాధించలేకపోయారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement