బార్బోడస్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో 6 వికెట్ల తేడాతో టీమిండియా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో బౌలింగ్, బ్యాటింగ్ పరంగా భారత జట్టు తీవ్ర నిరాశ పరిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా విండీస్ బౌలర్లు చెలరేగడంతో 40.5 ఓర్లలోనే 181 పరుగులకే కుప్పకూలింది.
భారత బ్యాటర్లలో కిషన్ (55), శుబ్‌మన్ గిల్(34) ఇద్దరూ మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. అనంతరం బౌలింగ్‌లో కూడా భారత్ ప్రభావం చూపలేకపోయారు. 182 పరుగుల లక్ష్యాన్ని విండీస్ 4 వికెట్లు కోల్పోయి సునయాసంగా ఛేదించింది. విండీస్ బ్యాటర్లలో కెప్టెన్ హోప్ (63 నాటౌట్), కార్టీ(48) పరుగులతో రాణించారు.
బాబర్ ఆజం ప్రపంచ రికార్డు బద్దలు..
ఇక ఈ మ్యాచ్‌లో భారత్ ఓటమి పాలైనప్పటికి.. స్టార్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ మాత్రం అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ వన్డేల్లో 26 ఇన్నింగ్స్‌లు తర్వాత అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా గిల్ ప్రపంచరికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు 26 మ్యాచ్‌లు ఆడిన గిల్.. 1352 పరుగులు చేశాడు. ఈ క్రమంలో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజంను గిల్ అధిగమించాడు. బాబర్ తన మొదటి 26 ఇన్నింగ్స్‌లలో 1322 పరుగులు చేశాడు.
చదవండి: కోహ్లి, గంభీర్ అలా చేస్తారనుకోలేదు.. చాలా బాధ కలిగించింది: కపిల్ దేవ్
Comments
Please login to add a commentAdd a comment