రేపు జాతీయ క్రీడా అవార్డుల ప్రదానం  | Sports Ministry to hand over trophies to winners of 2020 National Sports Awards on November 1 | Sakshi
Sakshi News home page

రేపు జాతీయ క్రీడా అవార్డుల ప్రదానం 

Published Sun, Oct 31 2021 7:58 AM | Last Updated on Sun, Oct 31 2021 7:58 AM

Sports Ministry to hand over trophies to winners of 2020 National Sports Awards on November 1 - Sakshi

న్యూఢిల్లీ: గత ఏడాదికి సంబంధించిన క్రీడా పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం రేపు జరగనుంది. 2020లో అవార్డుకు ఎంపికైన ఆటగాళ్లకు నగదు బహుమతి లభించినా కోవిడ్‌ కారణంగా ప్రభుత్వం అవార్డు జ్ఞాపికలను అందించలేకపోయింది.

దాంతో ఈ కార్యక్రమాన్ని న్యూఢిల్లీలోని ఓ హోటల్‌లో రేపు నిర్వహించి వారికి ప్రత్యక్షంగా అవార్డులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతీ ఏటా క్రీడా దినోత్సవమైన ఆగస్టు 29న అవార్డులు ఇవ్వడం సాంప్రదాయంగా వస్తోంది. అయితే కరోనా ఆంక్షలతో అది సాధ్యం కాలేదు.

చదవండి: బంగారంలాంటి బాక్సర్‌.. తజముల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement