ఎదురులేని హైదరాబాద్‌... వారెవ్వా మిలింద్‌.. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో.. | Syed Mushtaq Ali Trophy: Hyderabad Beat Delhi By 3 Wickets | Sakshi
Sakshi News home page

CV Milind: ఎదురులేని హైదరాబాద్‌... వారెవ్వా మిలింద్‌.. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో..

Published Tue, Nov 9 2021 8:18 AM | Last Updated on Tue, Nov 9 2021 8:22 AM

Syed Mushtaq Ali Trophy: Hyderabad Beat Delhi By 3 Wickets - Sakshi

Syed Mushtaq Ali Trophy: Hyderabad Beat Delhi By 3 Wickets- సుల్తాన్‌పూర్‌ (గురుగ్రామ్‌): సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ టి20 క్రికెట్‌ టోర్నీలో హైదరాబాద్‌ ఖాతాలో నాలుగో విజయం చేరింది. ఢిల్లీ జట్టుతో సోమవారం జరిగిన ఎలైట్‌ గ్రూప్‌ ‘ఈ’ మ్యాచ్‌లో హైదరాబాద్‌ మూడు వికెట్లతో నెగ్గింది. సీవీ మిలింద్‌ (2/49; 8 బంతుల్లో 14 నాటౌట్‌; ఫోర్, సిక్స్‌) ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో హైదరాబాద్‌ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ముందుగా ఢిల్లీ 20 ఓవర్లలో 5 వికెట్లకు 170 పరుగులు చేసింది.

171 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్‌ సరిగ్గా 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. కప్టెన్‌ తన్మయ్‌ అగర్వాల్‌ (34 బంతుల్లో 54; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), తిలక్‌ వర్మ (32 బంతుల్లో 37; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడారు. చివర్లో హైదరాబాద్‌ విజయానికి 17 బంతుల్లో 33 పరుగులు చేయాల్సిన స్థితిలో తనయ్‌ త్యాగరాజన్‌ (10 బంతుల్లో 17 నాటౌట్‌; 2 సిక్స్‌లు), మిలింద్‌ 8వ వికెట్‌కు 33 పరుగులు జోడించి గెలిపించారు.

చదవండి: Akshay Karnewar: 4–4–0–2.. అక్షయ్‌ కర్నేవార్‌ అరుదైన రికార్డు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement