టీ20 వరల్డ్‌కప్-2022 గ్రూప్-2లో భాగంగా ఇవాళ (అక్టోబర్ 30) పాకిస్తాన్-నెదర్లాండ్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన నెదర్లాండ్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. సెమీస్ రేసులో నిలవాలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్ అత్యంత కీలకంగా మారింది. దీంతో గెలుపు కోసం ఇరు జట్లు సర్వశక్తులు ఒడ్డనున్నాయి. ఈ టోర్నీలో ఇరు జట్లు ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండు స్థానాల్లో నిలిచాయి.
తుది జట్లు..
పాకిస్తాన్: మహ్మద్ రిజ్వాన్, బాబార్ ఆజమ్, షాన్ మసూద్, ఫఖర్ జమాన్, ఇఫ్తికార్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీం జూనియర్, షాహీన్ అఫ్రిది, హరీస్ రౌఫ్, నసీం షా
నెదర్లాండ్స్: స్టెఫాన్ మైబుర్గ్, మ్యాక్స్ ఓడౌడ్, బాస్ డి లీడ్, కొలిన్ అకెర్‌మన్, టామ్ కూపర్, స్కాట్ ఎడ్వర్డ్స్, రోల్ఫ్ వాన్ డెర్ మెర్వ్, టిమ్ ప్రింగిల్, ఫ్రెడ్ క్లాస్సెన్, బ్రాండన్ గ్లోవర్, పాల్ వాన్ మీకెరెన్
Comments
Please login to add a commentAdd a comment