భారత జట్టు
T20 World Cup 2022: ఆసియా కప్- 2022 టీ20 టోర్నీ ఆరంభ మ్యాచ్‌లలో టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించాడు స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా. ముఖ్యంగా లీగ్ దశలో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో భారత్ విజయం సాధించడంలో జడ్డూ పాత్ర మరువలేనిది. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో 35 పరుగులు సాధించాడు.
మరో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు సహకారం అందిస్తూ టీమిండియా గెలుపొందడంలో తన వంతు సాయం చేశాడు. ఇక హాంకాంగ్‌తో మ్యాచ్‌లో 4 ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసి 15 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీశాడు. కానీ ఆ తర్వాత గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ఇక సూపర్-4 స్టేజ్‌లో పాకిస్తాన్, శ్రీలంక చేతిలో వరుసగా ఓటమి పాలైన రోహిత్ సేన.. ఈ టోర్నీ నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే.
రవీంద్ర జడేజా(Twitter Pic)
గాయం కారణంగా!
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం స్వదేశంలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలతో సిరీస్‌ల తర్వాత టీ20 ప్రపంచకప్-2022 ఆడేందుకు ఆస్ట్రేలియాకు పయనం కానుంది టీమిండియా. ఇందుకోసం ఇప్పటికే జట్టును ప్రకటించింది బీసీసీఐ. అయితే, ఇంకా గాయం నుంచి కోలుకోకపోవడంతో జడేజా ఈ ఐసీసీ ఈవెంట్‌కు దూరమయ్యాడు.
జడ్డూ లేకపోవడం తీరని లోటు! అయితే..
ఈ నేపథ్యంలో శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్ధనే కీలక వ్యాఖ్యలు చేశాడు. రవీంద్ర జడేజా ప్రపంచకప్ జట్టులో లేకపోవడం టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ అని పేర్కొన్నాడు. బ్యాటింగ్ ఆర్డర్‌లో ఐదో స్థానానికి జడేజా చక్కగా సరిపోతాడన్న జయవర్ధనే.. ఆరో స్థానంలో వచ్చే మరో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాతో కలిసి మంచి భాగస్వామ్యం నమోదు చేయగలడని చెప్పుకొచ్చాడు.
వీరిద్దరి జోడీ బ్యాటింగ్ ఆర్డర్‌ను మరింత పటిష్టం చేస్తుందని పేర్కొన్నాడు. కానీ జడేజా గాయం కారణంగా జట్టుకు దూరం కావడం టీమిండియాకు తీరని లోటు అని వ్యాఖ్యానించాడు. అయితే, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి ఫామ్‌లో ఉండటం రోహిత్ సేనకు కలిసి వచ్చే అంశమని జయవర్ధనే పేర్కొన్నాడు.
కోహ్లి వంటి ప్రమాదకర ఆటగాడి వల్ల ప్రత్యర్థి జట్టుకు తిప్పలు తప్పవని.. జస్‌ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్ పునరాగమనంతో బౌలింగ్ విభాగం పటిష్టంగా తయారైందన్నాడు. ఏదేమైనా.. ఆస్ట్రేలియాలో వరల్డ్‌కప్ టీమిండియాకు గొప్పగా ఉండబోతోందని జయవర్ధనే జోస్యం చెప్పాడు.
చదవండి: మిర్కాతో అలా ప్రేమలో పడ్డ ఫెదరర్! ఫెడ్డీలో మనకు తెలియని కోణం!
Ind Vs Aus: టీ20 సిరీస్.. అరుదైన రికార్డుల ముంగిట కోహ్లి! అదే జరిగితే..
Comments
Please login to add a commentAdd a comment