
Iqbal Imam Comments On T20 world Cup Winner: టీ20 వరల్డ్‌కప్ ఆరంభం కానున్న నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఇక్బాల్ ఇమామ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ టోర్నీలో చాలా మందికి పాక్ ఫేవరెట్ జట్టు కాదని, అదే తమని గెలిపించే ఫ్యాక్టర్ కాబోతుందంటూ వ్యాఖ్యానించాడు. కాగా అక్టోబరు 17 నుంచి టీ20 ప్రపంచకప్ టోర్నీ మొదలుకానుంది. యూఏఈ, ఒమన్ వేదికగా జరుగనునన్న ఈ మెగా ఈవెంట్‌లో అక్టోబరు 24న చిరకాల ప్రత్యర్థి భారత్‌తో ఆడబోయే మ్యాచ్‌తో పాకిస్తాన్ తమ ప్రయాణాన్ని ఆరంభించనుంది.
ఆ తర్వాత న్యూజిలాండ్(అక్టోబరు 26), అఫ్గనిస్తాన్(అక్టోబరు 29)తో తదుపరి మ్యాచ్‌లు ఆడనుంది. ఈ నేపథ్యంలో ఇక్బాల్ ఇమామ్ మాట్లాడుతూ... ‘‘పాకిస్తాన్ జట్టులో యువ ఆటగాళ్లు ఎంతో మంది ఉన్నారు. వారు తమ శక్తి సామర్థ్యాల మేర రాణిస్తే టీ20 వరల్డ్‌కప్ గెలిచే అవకాశం ఉంది. హార్డ్ హిట్టర్లు మెరుగ్గా రాణించాలి. బ్యాటింగ్ ఆర్డర్ మరింత దృఢపడాలంటే హిట్టర్ల మీదే అంతా ఆధారపడి ఉంటుంది’’ అని చెప్పుకొచ్చాడు. ‘‘బౌలింగ్ విభాగంలో షహీన్, హస్నైన్‌పై ఆధారపడవచ్చు.. నేషనల్ టీ20 కప్‌లో వాళ్లిద్దరూ మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నారు. కచ్చితంగా వారు ప్రభావం చూపగలరు’’ అని ఇమామ్ పేర్కొన్నాడు.
అదే విధంగా స్పిన్నర్ల పాత్ర గురించి మాట్లాడుతూ... ‘‘యూఏఈలో స్పిన్నర్ల పాత్ర కీలకం. అయితే, పాక్ ఫాస్ట్ బౌలర్లు సైతం ఒంటి చేత్తో మ్యాచ్‌ను గెలిపించగల సత్తా ఉన్న వారే’’ అని పేర్కొన్నాడు. వరల్డ్‌కప్ విజేతపై అంచనాల గురించి చెబుతూ.. ‘‘నిజానికి పెద్ద పెద్ద టోర్నమెంట్లలో ఫేవరెట్‌గా బరిలో దిగిన జట్టు ఏదీ గెలవదు. పాకిస్తాన్‌కు టైటిల్ గెలిచే అవకాశాలు ఉన్నాయి’’ అని చెప్పుకొచ్చాడు. కాగా టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో ప్రకటించిన 15 మంది సభ్యులతో కూడిన జట్టు ఎంపికపై షోయబ్ అక్తర్, ఆఫ్రిది వంటి ఆటగాళ్లు అసంతృప్తిగా ఉన్న సంగతి తెలిసిందే.
15 మందితో పాక్ టీ20 ప్రాబబుల్స్:
బాబర్ అజమ్ (కెప్టెన్), షాదాబ్ ఖాన్(వైస్ కెప్టెన్), మహ్మద్ హఫీజ్, ఆసిఫ్ అలీ, అజమ్ ఖాన్, హారిస్ రౌఫ్, హసన్ అలీ, ఇమాద్ వసీం, ఖుష్దీల్ షా, మొహమ్మద్ హస్నైన్, మహ్మద్ నవాజ్, మహమ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), మొహమ్మద్ వసీం, షాహిన్ అఫ్రిది, సోహైబ్ మక్సూద్.
చదవండి: T20 World Cup: ‘మా జట్టులో సగం మంది అక్కడే.. ఏ జట్టునైనా ఓడించగలం’