
PC: India.com
2024 ఏడాదిలో తొలి మ్యాచ్ ఆడేందుకు టీమిండియా సిద్దమైంది. కేప్‌టౌన్ వేదికగా జనవరి 3 నుంచి భారత్-దక్షిణాఫ్రికా మధ్య రెండో టెస్టు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను సమం చేయాలని భారత్ భావిస్తుంటే.. మరోవైపు ప్రోటీస్ మాత్రం క్లీన్ స్వీప్ చేయాలని వ్యహాలు రచిస్తోంది. ఈ క్రమంలో రెండో టెస్టు కోసం టీమిండియా కేప్‌టౌన్‌లో అడుగుపెట్టింది.
సోమవారం సెంచూరియన్ నుంచి ప్రత్యేక విమానంలో కేప్‌టౌన్‌కు చేరుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ఎక్స్(ట్విటర్)లో షేర్ చేసింది. ఈ వీడియోలో కెప్టెన్ రోహిత్‌తో పాటు శ్రేయస్ అయ్యర్, జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్ వంటి ఆటగాళ్లు కన్పించారు. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.
తొలి మ్యాచ్‌కు గాయం కారణంగా దూరమైన స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా.. ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. దీంతో అతడు రెండో టెస్టుకు జట్టు సెలక్షన్‌కు అందుబాటులోకి వచ్చాడు. జడ్డూ తుది జట్టులోకి వస్తే అశ్విన్‌పై వేటు పడనుంది. అదే విధంగా తొలి టెస్టులో దారుణంగా విఫలమైన పేసర్ ప్రసిద్ద్ కృష్ణ స్ధానంలో ముఖేష్ కుమార్ తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది.
చదవండి: గిల్ కొంచెం దూకుడు తగ్గించుకుంటే మంచిది: గవాస్కర్
📍Cape Town#TeamIndia have arrived for the second #SAvIND Test 👌🏻👌🏻 pic.twitter.com/VGCTdk7yzO
— BCCI (@BCCI) January 1, 2024