స్టాండ్స్‌లోకి పంపుదామనుకుంటే స్టన్‌ అయ్యాడు.. | Team India vs Australia: Rahul Falls For Duck In First Over | Sakshi
Sakshi News home page

స్టాండ్స్‌లోకి పంపుదామనుకుంటే స్టన్‌ అయ్యాడు..

Published Tue, Dec 8 2020 4:07 PM | Last Updated on Tue, Dec 8 2020 4:07 PM

Team India vs Australia: Rahul Falls For Duck In First Over - Sakshi

సిడ్నీ:  ఆసీస్‌తో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా ఆదిలోనే వికెట్‌ను కోల్పోయింది. ఆసీస్‌ నిర్దేశించిన 187 పరుగుల ఛేదనలో టీమిండియా ఇన్నింగ్స్‌ను కేఎల్‌ రాహుల్‌, శిఖర్‌ ధావన్‌లు ఆరంభించారు. కాగా, ఆసీస్‌ తొలి ఓవర్‌ను స్పిన్‌తో ప్రయోగం చేసింది. పార్ట్‌ టైమ్‌ బౌలర్‌ మ్యాక్స్‌వెల్‌ చేతికి బంతినిచ్చింది. కాగా, మ్యాక్స్‌వెల్‌ ఊరిస్తూ వేసిన తొలి ఓవర్‌ రెండో బంతిని రాహుల్‌ భారీ షాట్‌ కొట్టబోయాడు. కానీ అది కాస్తా బ్యాట్‌కు మిడిల్‌ కాకపోవడంతో బౌండరీ లైన్‌కు ముందు ఉన్న స్టీవ్‌ స్మిత్‌ చేతుల్లో పడింది. అది స్టాండ్స్‌లోకి పంపుదామనుకుంటే క్యాచ్‌ కావడంతో రాహుల్‌ స్టన్‌ అయ్యాడు. అసలు స్కోరు బోర్డుపై పరుగులేమీ లేకుండా పెవిలియన్‌ చేరాడు. ముందుగా బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది.  మాథ్యూ వేడ్‌  విధ్వంసకర ఇన్నింగ్స్‌కు తోడు ఆల్‌రౌండర్‌ మ్యాక్స్‌వెల్‌ చెలరేగడంతో మూడో టీ20లో ఆసీస్‌ భారీ స్కోరు నమోదు చేసింది. ముందుగా టాస్‌ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్‌ ఎంచుకొని ఆసీస్‌ బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఓపెనర్‌ ఆరోన్‌ ఫించ్‌ రెండో ఓవర్‌ వేసిన వాషింగ్టన్‌ సుందర్‌ బౌలింగ్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. అయితే ఈ ఆనందం టీమిండియాకు ఎంతోసేపు నిలవలేదు.(పాండ్యా ఇప్పుడు ధోనిలా కనిపిస్తున్నాడు)

ఫించ్‌ వెనుదిరిగిన అనంతరం క్రీజులోకి వచ్చిన స్మిత్‌తో కలిసి మరో ఓపెనర్‌ వేడ్‌ చెలరేగిపోయాడు. అయితే మరోసారి బౌలింగ్‌కు వచ్చిన సుందర్‌ 24 పరుగులు చేసిన స్మిత్‌ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. దీంతో ఆసీస్‌  79 పరుగులు వద్ద రెండో వికెట్‌ను కోల్పోయింది. తర్వాత వచ్చిన మ్యాక్స్‌వెల్‌ దాటిగా ఆడడంతో స్కోరుబోర్డు పరుగులెత్తింది. ఈ దశలో వేడ్ టోర్నీలో వరుసగా రెండో హాఫ్‌ సెంచరీ సాధించాడు. హాఫ్‌ సెంచరీ తర్వాత మరింత రెచ్చిపోయిన  వేడ్‌.. ఫోర్లు, సిక్సర్లు బాదేశాడు. మ్యాక్స్‌వెల్‌ కూడా బ్యాట్‌కు పనిజెప్పడంతో ఆసీస్‌కు పరుగులు వేగంగా వచ్చాయి. ఈ నేపథ్యంలో మ్యాక్స్‌వెల్‌ కూడా 30 బంతుల్లో టోర్నీలో తొలి ఫిప్టీ సాధించాడు. అయితే స్కోరును పెంచే ప్రయత్నంలో వేడ్‌, మ్యాక్స్‌వెల్‌ అవుటవడం.. చివరి రెండు ఓవర్లు భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌల్‌ చేయడంతో ఆసీస్‌ 20 ఓవర్లలో 186 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ ముగించింది. టీమిండియా బౌలర్లలో  సుందర్‌ 2, నటరాజన్‌, ఠాకూర్‌లు చెరో వికెట్‌ తీశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement