టోక్యో: ఒలింపిక్స్‌లో జపాన్ టెన్నిస్ స్టార్.. ప్రపంచ రెండో ర్యాంకర్ నవోమి ఒసాకాకు షాక్ తగిలింది. టెన్నిస్ సింగిల్స్ విభాగం నుంచి ఆమె నిష్క్రమించింది. కాగా తాను ఆడిన మొదటి రెండు మ్యాచ్‌ల్లో పెద్దగా కష్టపడకుండానే విజయాలు సాధించిన ఒసాకా మూడవ రౌండ్‌లో మాత్రం ఎవరు ఊహించిన విధంగా వరుస సెట్లలో ఓటమి పాలయ్యింది. చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి వండ్రోసోవాతో జరిగిన మ్యాచ్‌లో 6-1, 6-4 స్కోర్ తేడాతో ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్‌లో ఒకాసా 32 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది.
కాగా మ్యాచ్ ప్రారంభం నుంచి ఈ జపాన్ ప్లేయర్ తడబడుతూనే ఆడింది. కాగా లోకల్ ప్లేయర్‌గా మంచి అంచనాలతో బరిలోకి దిగిన ఒసాకా పతకం లేకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. అంతకముందు టెన్నిస్ మహిళల నెంబర్‌వన్ క్రీడాకారిణి యాష్లే బార్టీ తొలి రౌండ్‌లోనే ఓటమి పాలైన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment