
కాలిఫోర్నీయా: ఇండియన్ వెల్స్ డబ్ల్యూటీఏ–1000 టెన్నిస్ టోర్నీలో ప్రపంచ రెండో ర్యాంకర్, బెలారస్ స్టార్ సబలెంకాకు ఊహించని పరాజయం ఎదురైంది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ సబలెంకా 3–6, 6–3, 2–6తో ప్రపంచ 23వ ర్యాంకర్ ఎమ్మా నవారో (అమెరికా) చేతిలో ఓడిపోయింది.