ఈస్ట్‌జోన్‌దే టైటిల్‌!.. చ‌రిత్ర సృష్టించ‌నున్న వైభ‌వ్! | Vaibhav-Verge-Becoming Youngest-Member-Duleep-Trophy-winning-Team | Sakshi
Sakshi News home page

Duleep-Trophy: ఈస్ట్‌జోన్‌దే టైటిల్‌!.. చ‌రిత్ర సృష్టించ‌నున్న వైభ‌వ్!

Sep 9 2026 1:44 PM | Updated on Sep 9 2026 3:23 PM

Vaibhav-Verge-Becoming Youngest-Member-Duleep-Trophy-winning-Team

Photo Credit: BCCI Twitter

దులీప్ ట్రోఫీని ఈసారి ఈస్ట్ జోన్ గెలుచుకునే అవ‌కాశాలు ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. ఫైన‌ల్లో సౌత్‌జోన్ త‌మ తొలి ఇన్నింగ్స్‌లో 336 ప‌రుగుల‌కు ఆలౌట్ కావ‌డంతో ఈస్ట్‌జోన్‌కు 372 ప‌రుగుల భారీ ఆధిక్యం ల‌భించింది. మ్యాచ్‌కు ఒక‌రోజు మాత్ర‌మే మిగిలి ఉండ‌డంతో డ్రా అయ్యే అవ‌కాశాలే ఎక్కువ‌గా ఉన్నాయి. 

దీంతో నిబంధ‌న‌ల ప్ర‌కారం తొలి ఇన్నింగ్స్‌లో ఏ జ‌ట్టు ఆధిక్యంలో నిలిస్తే వారికే దులీప్ ట్రోఫీ ద‌క్కనుంది. ఈ లెక్క‌న తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం సాధించిన ఈస్ట్‌జోన్ 13 సంవ‌త్స‌రాల త‌ర్వాత టైటిల్ అందుకోనుంది. ఇదే స‌మ‌యంలో జ‌ట్టులో స‌భ్యుడిగా ఉన్న వైభ‌వ్ సూర్య‌వంశీ కూడా చ‌రిత్ర సృష్టించ‌నున్నాడు. 

వైభ‌వ్ సూర్య‌వంశీ వ‌య‌సు 15 ఏళ్లు కావ‌డంతో, అత్యంత పిన్న వ‌య‌స్సులో దులీప్ ట్రోఫీ నెగ్గిన జ‌ట్ట‌లోని ఆట‌గాడిగా రికార్డుల‌కెక్క‌నున్నాడు. ఇప్ప‌టికే టోర్నీలో సెమీఫైన‌ల్లో హాఫ్ సెంచ‌రీ సాధించి అత్యంత పిన్న‌వ‌య‌స్కుడిగా నిలిచిన వైభ‌వ్, క‌ప్‌ను ఈస్ట్‌జోన్ సొంతం చేసుకుంటే మాత్రం పైన చెప్పుకున్న ఘ‌న‌త కూడా వైభ‌వ్ ఖాతాలో చేర‌నుంది.

డ్యాన్స్ చేసిన వైభ‌వ్‌..
ఇక మ్యాచ్‌లో సౌత్‌జోన్ ఇన్నింగ్స్ సంద‌ర్భంగా త్రిపురానా విజ‌య్ వికెట్ ప‌డిన‌ప్పుడు వైభ‌వ్ సూర్య‌వంశీ డ్యాన్స్ మూమెంట్ ఇవ్వ‌డం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. 708 ప‌రుగులు చేసిన ఈస్ట్‌జోన్‌కు పోటీ ఇచ్చే క్ర‌మంలో సౌత్‌జోన్ త‌ర‌ఫున ఆ జ‌ట్టు కెప్టెన్ తిలక్ వ‌ర్మతో పాటు దేవ‌ద‌త్ ప‌డిక్క‌ల్‌, సీవీ మిలింద్ కాస్త ప్ర‌తిఘ‌టించారు. తాను ఒక ఎండ్‌లో పాతుకుపోయిన‌ప్ప‌టికీ, మ‌రో ఎండ్‌లో మాత్రం వ‌రుస‌గా వికెట్లు ప‌డ‌డంతో వైభ‌వ్ ఉబ్బిత‌బ్బియ‌య్యాడు. 

ఈ ద‌శ‌లో క్రీజులోకి వ‌చ్చిన త్రిపురానా విజ‌య్ కెప్టెన్‌తో ఏర్ప‌డిన స‌య‌న్వ‌య లోపంతో ర‌నౌట్‌గా వెనుదిరిగాడు. ఖురేషీ వేసిన  ఆఫ్‌స్టంప్ బంతిని తిల‌క్ వ‌ర్మ క‌ట్‌షాట్ ఆడాడు. త‌న‌వైపు వ‌చ్చిన బంతిని అభిజిత్ స‌ర్కార్ వేగంగా అందుకొని అంతే వేగంతో వికెట్ కీప‌ర్ ఇషాన్ వైపు విసిరాడు. 

అప్ప‌టికే తిల‌క్ సింగిల్ తీయాలా వ‌ద్దా అనే డైల‌మాలోనే ముందుకు ప‌రిగెత్తాడు. దీంతో కాస్త లేటుగా ర‌న‌ప్ అందుకున్న త్రిపురానా విజ‌య్ స్ట్రైక్ ఎండ్‌కు చేరేలోపే ఇషాన్ వికెట్ల‌ను గిరాటేయ‌డంతో అత‌డు ర‌నౌట్ అయ్యాడు. విజ‌యానికి చేరువ కావ‌డంతో సంతోషం ప‌ట్ట‌లేని వైభ‌వ్ చిన్న డ్యాన్స్ మూమెంట్ ఇవ్వ‌డం కెమెరాల‌కు చిక్కింది.  

ఇక తొలి ఇన్నింగ్స్‌లో ఈస్ట్‌జోన్ 708 ప‌రుగుల‌కు ఆలౌటైంది. ఇషాన్ కిష‌న్ (270) డ‌బుల్ సెంచ‌రీ సాధించ‌గా, కుమార్ కుషాగ్ర (101) సెంచ‌రీ చేశాడు. అభిమ‌న్యు ఈశ్వ‌ర‌న్ (72), శిఖ‌ర్ మోహ‌న్ (85) అర్థ‌సెంచ‌రీలు సాధించారు. సౌత్‌జోన్ బౌల‌ర్ల‌లో త్రిపురానా విజ‌య్ 4 వికెట్లు ప‌డ‌గొట్టాడు. 

అనంత‌రం సౌత్‌జోన్ 107.3 ఓవ‌ర్ల‌లో 336 ప‌రుగుల‌కు ఆలౌటైంది. తిల‌క్ వ‌ర్మ (99) ఒక్క ప‌రుగు తేడాతో సెంచ‌రీ మిస్ చేసుకోగా, ప‌డిక్క‌ల్ (62) అర్థ‌సెంచ‌రీ సాధించాడు. ఈస్ట్‌జోన్ బౌల‌ర్ల‌లో ముకేశ్ కుమార్ మూడు వికెట్లు తీయ‌గా, ష‌మీ, ఖురేషి, శిఖ‌ర్ మోహ‌న్ త‌లా 2 వికెట్లు ప‌డ‌గొట్టారు.

Read: ‘పూటుగా తాగి పీడకలనుకొని మరిచిపోతా’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement