ఆర్సీబీకి గుడ్‌ న్యూస్‌.. విరాట్‌ కోహ్లి వచ్చేస్తున్నాడు? | Virat Kohli all set to join Royal Challengers Bangalore camp in next few days | Sakshi
Sakshi News home page

IPL 2024: ఆర్సీబీకి గుడ్‌ న్యూస్‌.. విరాట్‌ కోహ్లి వచ్చేస్తున్నాడు?

Published Wed, Mar 13 2024 10:40 AM | Last Updated on Wed, Mar 13 2024 11:05 AM

Virat Kohli all set to join Royal Challengers Bangalore camp in next few days - Sakshi

ఐపీఎల్‌-2024 సీజన్‌ ఆరంభానికి ఇంకా కేవలం 8 రోజుల సమయం మాత్రమే మిగిలింది. మార్చి 22న చెపాక్‌ వేదికగా జరగనున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మ్యాచ్‌తో ఈ మెగా ఈవెంట్‌కు తెరలేవనుంది.

ఈ క్రమంలో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు గుడ్‌ న్యూస్‌ అందింది. గత రెండు నెలలగా వ్యక్తిగత కారణాలతో ఆటకు దూరంగా ఉన్న టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి.. మరో మూడు రోజుల్లో ఆర్సీబీ జట్టుతో కలవనున్నట్లు తెలుస్తోంది. 

ప్రస్తుతం లండన్‌లో వున్న విరాట్‌ ఈ వారం చివరిలోపు ఆర్సీబీ ప్రీ-సీజన్ ట్రైనింగ్‌ క్యాంప్‌లో చేరనున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. అదేవిధంగా మార్చి 19న ఆర్సీబీ తమ కొత్త జెర్సీని రీవీల్‌ చేసేందుకు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలోని ఓ కార్యక్రమంను నిర్వహించనుంది.

ఈ ఈవెంట్‌లో కోహ్లి సైతం పాల్గోనున్నాడని ఆర్సీబీ వర్గాలు వెల్లడించాయి. ఇక ఇప్పటికే ఆర్సీబీ కెప్టెన్‌ ఫాప్‌ డుప్లెసిస్‌ సైతం జట్టుతో కలిశాడు. ఈ విషయాన్ని ఆర్సీబీ సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది.

టీ20 వరల్డ్‌కప్‌ జట్టులో నో ఛాన్స్‌..?
ఇక ఇది ఇలా ఉండగా..  విరాట్‌ కోహ్లి విషయంలో బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. టీ20 వరల్డ్‌‌కప్‌ జట్టులో కోహ్లికి చోటు కల్పించకుండా యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని అగర్కార్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే కోహ్లి ఐపీఎల్‌లో బాగా రాణిస్తే సెలక్టర్లు తమ నిర్ణయాన్ని మార్చుకునే ఛాన్స్‌ ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement