టీమిండియా స్టార్ విరాట్ కోహ్లికి మంచి ఫీల్డర్ అని పేరుంది. ఎన్నోసార్లు స్టన్నింగ్ క్యాచ్‌లు అందుకున్న కోహ్లి చేతులు ఇవాళ పట్టు జారిపోతున్నాయి. బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో కోహ్లి క్యాచ్‌ల వైఫల్యం కొనసాగుతూనే ఉంది. నాగ్‌పూర్ వేదికగా జరిగిన తొలి టెస్టులోనూ కోహ్లి రెండు ఈజీ క్యాచ్‌లను జారవిడిచాడు. తాజాగా రెండో టెస్టులోనూ పీటర్ హ్యాండ్స్‌కోబ్ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను నేలపాలు చేశాడు.
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 68వ ఓవర్ అక్షర్ పటేల్ వేశాడు. ఆ ఓవర్‌లో ఐదో బంతిని హ్యాండ్స్‌కోబ్ ఔట్‌సైడ్ ఆఫ్ దిశగా ఆడాడు. అక్కడే ఉన్న కోహ్లి బంతిని అందుకునే ప్రయత్నంలో చేతి ఎడ్జ్ తగిలి పైకి వెళ్లిన బంతి బౌండరీ వైపు పరుగులు పెట్టింది. క్యాచ్ మిస్ చేసిన కోహ్లి నేలమీద పడుకొని అబ్బా మిస్ అయింది అన్నట్లుగా ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కోహ్లి ఎక్కువగా స్లిప్స్‌లో ఫీల్డింగ్ చేయడం గమనిస్తుంటాం. మాములుగా స్లిప్‌లో ఫీల్డింగ్ అంటే చాలా అలర్ట్‌గా ఉండాలి. ఒకటి రెండుసార్లు పొరపాటున క్యాచ్‌లు జారవిడిస్తే పర్వాలేదు కానీ ఇలా ప్రతీసారి క్యాచ్‌లు అందుకోవడంలో విఫలమైతే కష్టమే. టాప్‌క్లాస్ ఫీల్డర్‌గా పేరు తెచ్చుకున్న కోహ్లి ఇలా చేయడమేంటని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.
mehnat barbad kar di pic.twitter.com/4ES99H9l3F
— Saddam Ali (@SaddamAli7786) February 17, 2023
Comments
Please login to add a commentAdd a comment