టీ20 ప్రపంచకప్‌కు ముందు స్వదేశంలో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఆస్ట్రేలియాతో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. ఈ సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య తొలి టీ20 మొహాలీ వేదికగా మంగళవారం(సెప్టెంబర్20) జరగనుంది. ఈ క్రమంలో తొలి టీ20కు ముందు విలేకురల సమావేశంలో పాల్గొనున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వాఖ్యలు చేశాడు.
ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లి భారత్ ఓపెనర్‌గా వచ్చే అవకాశం ఉందిని రోహిత్ తెలిపాడు. కాగా ఆసియాకప్‌లో భాగంగా ఆఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన కోహ్లి అద్భుతమైన సెంచరీ సాధించాడు. దీంతో సెంచరీకోసం తన 1000 రోజుల నిరీక్షణకు విరాట్ తెర దించాడు. ఈ క్రమంలో టీ20ల్లో భారత ఓపెనర్‌గా కోహ్లిని పంపాలని మాజీలు, క్రికెట్ నిపుణులు సూచిస్తున్నారు.
"మాకు ఓపెనింగ్ స్థానం కోసం జట్టులో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ముఖ్యంగా మాకు ఇది ప్రపంచకప్‌లో ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. మా జట్టు ఆటగాళ్లు ఏ స్థానంలో బ్యాటింగ్ చేసినా అద్భుతంగా రాణించాలని ఎప్పుడూ కోరుకుంటాను. ఈ మెగా ఈవెంట్‌లో మేము బ్యాటింగ్ అర్డర్‌లో కొన్ని ప్రయోగాలు చేయవచ్చు. ఈ పొట్టి ప్రపంచకప్‌లో కోహ్లి ఓపెనర్‌గా ఛాన్స్ ఉంది.
విరాట్ ఓపెనర్‌గా మాకు మంచి ఎంపిక. ఆర్సీబీ ఇన్నింగ్స్‌ను కూడా కోహ్లి ప్రారంభిస్తాడు. అతడు ఓపెనర్‌గా ఐపీఎల్‌లో అద్భుతంగా రాణించాడు. కాబట్టి మా ప్రాణాళికలో కోహ్లి ఓపెనర్‌గా ఉంటాడు. అందుకే ఈ ఐసీసీ ఈవెంట్‌కు మూడువ ఓపెనర్‌ను కూడా మేము ఎంపిక చేయలేదు "అని రోహిత్ పేర్కొన్నాడు.
చదవండి: రివ్యూయర్లూ.. బహుపరాక్, తప్పుడే రివ్యూ రాస్తే మరణమే..!
Comments
Please login to add a commentAdd a comment