ఇదేం షాట్‌ రా బాబోయ్‌.. విరాట్‌ కోహ్లి షాకింగ్‌ రియాక్షన్‌! వీడియో వైరల్‌ | Virat Kohli Shocked As Shubman Gill Whacks Madushanka For A Boundary | Sakshi
Sakshi News home page

WC 2023: ఇదేం షాట్‌ రా బాబోయ్‌.. విరాట్‌ కోహ్లి షాకింగ్‌ రియాక్షన్‌! వీడియో వైరల్‌

Published Thu, Nov 2 2023 4:17 PM | Last Updated on Thu, Nov 2 2023 4:28 PM

Virat Kohli Shocked As Shubman Gill Whacks Madushanka For A Boundary - Sakshi

వన్డే ప్రపంచకప్‌-2023లో భాగంగా వాంఖడే వేదికగా భారత్‌-శ్రీలంక జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన శ్రీలంక కెప్టెన్‌ కుశాల్‌ మెండీస్‌ టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్హనించాడు. అయితే బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆదిలోనే బిగ్‌ షాక్‌ తగిలింది. తొలి ఓవర్‌లో రెండో బంతికి కెప్టెన్‌ రోహిత్‌ శర్మ క్లీన్‌ బౌల్డయ్యాడు.

తర్వాత శుబ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లి భారత ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. 24 ఓవర్లు ముగిసే సరికి వీరిద్దరూ రెండో వికెట్‌కు 136 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పారు. కోహ్లి(71 బంతుల్లో 67), గిల్‌(72 బంతుల్లో 60) బ్యాటింగ్‌ చేస్తున్నారు. 

విరాట్‌ కోహ్లి షాకింగ్‌ రియాక్షన్‌..
కాగా ఈ మ్యాచ్‌లో శుబ్‌మన్‌ గిల్‌ ఆడిన ఓ షాట్‌కు విరాట్‌ కోహ్లి ఆశ్చర్యపోయాడు. భారత ఇన్నింగ్స్‌ 16 ఓవర్‌ వేసిన మధుశంక ఓవర్‌లో మూడో బంతిని గిల్‌ ఎక్స్‌ట్రా కవర్‌ మీదగా అద్భుతమైన షాట్‌ ఆడాడు. గిల్‌ కొట్టిన బంతి కళ్లు మూసి తెరిచే లోపే బౌండరీకి వెళ్లిపోయింది. ఈ క్రమంలో నాన్‌స్ట్రైక్‌లో ఉన్న కోహ్లి వావ్‌ అంటూ షాకింగ్‌ రియాక్షన్‌ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.
చదవండి: World cup 2023: చరిత్ర సృష్టించిన విరాట్‌ కోహ్లి.. సచిన్‌ రికార్డు బద్దలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement