ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి మరో వారం రోజుల సమయం మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌లోని ఆయా జట్లు ప్రాక్టీస్‌లో మునిగి తేలుతున్నాయి. మార్చి 28న జరగనున్న సీజన్ ఆరంభ మ్యాచ్‌లోనే డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్)తో తలపడనుంది.
ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఇప్పటికే లండన్ నుంచి భారత్ చేరుకొని తన ప్రాక్టీస్‌ను మొదలుపెట్టాడు. తాజాగా ప్రాక్టీస్ సందర్భంగా టీమిండియా సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ వేసిన యార్కర్ బంతికి కోహ్లీ వద్ద సమాధానం లేకుండా పోయింది. 36 ఏళ్ల వయసులోనూ బంతిని స్వింగ్ చేయడంలో తన పదును చూపెడుతున్నాడు. భువీ వేసిన అద్భుత యార్కర్ కోహ్లీ లెగ్‌స్టంప్‌ను తాకుతూ వెళ్లింది. దీంతో అదుపు తప్పిన కోహ్లీ పక్కకు పడిపోగా బంతి వెళ్లి నేరుగా వికెట్లను గిరాటేసింది.
దీంతో షాక్ తిన్న కోహ్లీ ‘వాట్ ఏ బాల్ భువీ’ అంటూ పేర్కొన్నాడు. దీనికి భువనేశ్వర్ నవ్వుతోనే రియాక్షన్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియోను ఒక అభిమాని తన ‘ఎక్స్’ ఖాతాలో షేర్ చేసుకోవడంతో వైరల్‌గా మారింది. గతేడాది ఆర్సీబీ టైటిల్ గెలవడంలో కోహ్లీతో పాటు భువనేశ్వర్ కూడా కీలకపాత్ర పోషించాడు. బ్యాటింగ్‌లో కోహ్లీ 15 ఇన్నింగ్స్‌ల్లో 657 పరుగులు సాధించగా.. భువనేశ్వర్ 14 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు పడగొట్టాడు.
ఈ సీజన్‌లోనూ ఈ ఇద్దరు సీనియర్లు ఆర్సీబీకి కీలకం కానున్నారు. బ్యాటింగ్‌లో కోహ్లీ పెద్దన్న పాత్ర పోషించనుండగా.. బౌలింగ్ దళాన్ని భువనేశ్వర్ నడిపించనున్నాడు. ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు జోష్ హాజిల్‌వుడ్ గాయం కారణంగా సీజన్ ఆరంభ మ్యాచ్‌లకు దూరంగా ఉండడనున్నాడు. మరోవైపు భారత బౌలర్ యశ్ దయాల్ విషయంలో కూడా స్పష్టత లేదు. దీంతో రషీక్ సలామ్, మంగేశ్ యాదవ్‌లకు భువనేశ్వర్ మెంటార్‌గా కూడా వ్యవహరించే అవకాశముంది. ఐపీఎల్ 2025 మెగావేలంలో భువనేశ్వర్ కుమార్‌ను ఆర్సీబీ రూ. 10.75 కోట్లకు కొనుగోలు చేయడం విశేషం.
This yorker from Bhuvneshwar Kumar completely beat Virat Kohli.🫡
In the last two years, Bhuvneshwar Kumar’s name has gone a bit down, but maybe in this IPL he will definitely do something special.🙌 pic.twitter.com/L0bF9BsR0Z— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) March 19, 2026
చదవండి: ODI WC: బీసీసీఐ బిగ్ ప్లాన్.. షార్ట్‌లిస్టులో ఇరవై పేర్లు!


