వైజాగ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా యువ ఆటగాళ్లు యశస్వీ జైశ్వాల్, శుబ్‌మన్ గిల్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచారు. తొలి ఇన్నింగ్స్‌లో జైశ్వాల్(209) విరోచిత డబుల్ సెంచరీతో చెలరేగగా.. రెండో ఇన్నింగ్స్‌లో గిల్(104) సైతం శతకంతో మెరిశాడు. ఈ నేపథ్యంలో వీరిద్దరిపై భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసల వర్షం కురిపించారు. భవిష్యత్తులో యశస్వీ, శబ్‌మన్ ప్రపంచ క్రికెట్‌లో ఆధిపత్యం చెలాయిస్తారని సెహ్వాగ్ జోస్యం చెప్పాడు.
"అతి చిన్న వయస్సులోనే గిల్, జైశ్వాల్ అసాధారణమైన ప్రతిభను కనబరుస్తున్నారు. వారు ఆటతీరును చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవడం వారి స్పెషల్. వీరిద్దరూ రాబోయే రోజుల్లో కచ్చితంగా వరల్డ్ క్రికెట్‌ను ఏలుతారు" అని ఎక్స్(ట్విటర్)లో సెహ్వాగ్ రాసుకొచ్చాడు. ఇక రెండో టెస్టు రసవత్తరంగా మారింది. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించాలంటే ఇంకా 9 వికెట్లు పడగొట్టాలి.
399 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్.. మూడో రోజు ఆట ముగిసే సరికి వికెట్ నష్టానికి 67 పరుగులు చేసింది. ఇంగ్లండ్ మరో విజయాన్ని తమఖాతాలో వేసుకోవాలంటే 332 పరుగులు చేయాల్సింది.
ఒకవేళ ఇంగ్లండ్ ఈ లక్ష్యాన్ని ఛేదిస్తే భారత్ గడ్డపై సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. ఎందుకంటే భారత గడ్డపై టెస్టు క్రికెట్‌లో ఈ జట్టు కూడా ఇంత భారీ లక్ష్యాన్ని ఛేదించలేదు. భారత్‌లో ఓ జట్టు ఛేదించిన అత్యధిక లక్ష్యం 387గా ఉంది. 2008లో చెన్నైలో ఇంగ్లాండ్‌పై భారత్ ఈ ఛేదన చేసింది.
చదవండి: NZ vs SA: రచిన్ రవీంద్ర విధ్వంసం.. ఏకంగా డబుల్ సెంచరీతో
Comments
Please login to add a commentAdd a comment