రికార్డు సృష్టించిన విరుష్క జంట | Virushka Is the only Indians Followed By Instagram | Sakshi
Sakshi News home page

విరుష్క దంపతులను ఫాలో అవుతోన్న ఇన్‌స్టాగ్రామ్‌

Published Sat, Aug 15 2020 6:53 PM | Last Updated on Sat, Aug 15 2020 8:48 PM

Virushka Is the only Indians Followed By Instagram - Sakshi

ముంబై: టీమిండియా సారథి విరాట్‌ కోహ్లి దంపతులుకు ఉన్న క్రేజ్‌, ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అభిమానుల చేత ‘విరుష్క’లుగా పిలవబడే ఈ జంట తాజాగా ఓ రికార్టు నెలకొల్పారు. ఇన్‌స్టాగ్రామ్‌ పాపులర్‌ సిరీస్‌ ‘టేక్‌ ఏ బ్రేక్’‌లో కనిపించిన తొలి భారతీయులుగా రికార్డు సృష్టించారు. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా నిర్వహించే ఈ సిరీస్‌కు ప్రపంచవ్యాప్తంగా ఎంతో క్రేజ్‌ ఉంది. అంతేకాక మార్క్‌ జుకర్‌బర్గ్‌ యాజమాన్యంలోని ఇన్‌స్టాగ్రామ్‌ ప్రపంచవ్యాప్తంగా కేవలం 59 ఐకానిక్‌ పర్సనాలిటీలను ఫాలో అవుతుండగా.. వారిలో తాజాగా విరష్క దంపతులు కూడా చేరారు.

భారత్‌ నుంచి ఈ ఘనత సాధించిన ఏకైక కపుల్‌గా వీరు రికార్డు సృష్టించారు. లక్షలాది మంది అభిమానుల చేత ‘విరుష్క’గా పిలువబడే అనుష్క శర్మ, విరాట్ కోహ్లిలు తమ తమ రంగాలలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులు. వీరిద్దరూ తమ కెరీర్‌లో అద్భుతంగా రాణించడమే కాక చాలా మందికి ప్రేరణగా నిలిచారు. దాంతో విరుష్క దంపతులు.. సెలెనా గోమెజ్, మిలే సైరస్, నవోమి కాంప్‌బెల్ వంటి గ్లోబల్ ఐకాన్‌ల సరసన చేరారు. వీరు కూడా గతంలో 'టేక్ ఏ బ్రేక్' సిరీస్‌లో నటించారు. ఈ సిరీస్‌లో యూత్‌ ఐకాన్‌లుగా నిలిచే వారి వ్యక్తిగత జీవితాల గురించి లోతైన విషయాలను వెల్లడిస్తారు.(ఆమె వల్లనే నాలో ఈ మార్పు: కోహ్లి)

ఇక విరుష్కల ‘టేక్‌ ఏ బ్రేక్’‌ సిరీస్‌ విషయానికి వస్తే.. దీనిలో అనుష్క, విరాట్‌లు తమ వ్యక్తిగత జీవితాల గురించేకాక వృత్తులు, ఇష్టాఇష్టాల గురించి ఒకరిపై ఒకరు ప్రశ్నలు సంధించుకున్నారు. అంతేకాక తమ దాంపత్య జీవితం గురించి పలు ఆసక్తికర అంశాలు వెల్లడించారు. 24 గంటల వ్యవధిలోనే ఈ వీడియోను 150 మిలియన్ల మంది విక్షించి రికార్డు సృష్టించారు. పూర్తి వివరాల కోసం వీడియో చూడండి.. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement