WC 2023: కోహ్లి సరికొత్త చరిత్ర.. జయవర్దనే రికార్డు బద్దలు! ఇ​క మిగిలింది.. | WC 2023: Kohli Breaks Jayawardene Record Most runs in International Cricket | Sakshi
Sakshi News home page

#Virat Kohli: కోహ్లి సరికొత్త చరిత్ర.. జయవర్దనే రికార్డు బద్దలు! ఇ​క మిగిలింది ఆ ఇద్దరు.. తర్వాత

Published Thu, Oct 19 2023 8:22 PM | Last Updated on Thu, Oct 19 2023 9:01 PM

WC 2023: Kohli Breaks Jayawardene Record Most runs in International Cricket - Sakshi

ICC ODI WC 2023- Virat Kohli: టీమిండియా స్టార్ బ్యాటర్‌, రన్‌మెషీన్‌ విరాట్‌ కోహ్లి మరో అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో నాలుగో స్థానానికి ఎగబాకాడు.

ఈ క్రమంలో శ్రీలంక దిగ్గజం మహేల జయవర్దనే పేరిట ఉన్న రికార్డును కింగ్‌ కోహ్లి బద్దలు కొట్టాడు. వన్డే వరల్డ్‌కప్‌-2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో పుణెలో గురువారం(అక్టోబరు 19) నాటి మ్యాచ్‌లో ఈ అరుదైన ఫీట్‌ నమోదు చేశాడు.

బంగ్లా విధించిన 257 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఇన్నింగ్స్‌లో 21వ ఓవర్‌ మూడో బంతికి షోరిఫుల్‌ ఇస్లాం బౌలింగ్‌లో శ్రేయస్‌ అయ్యర్‌తో కలిసి సింగిల్‌ తీసిన ఈ రికార్డుల రారాజు.. ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లో 25958* పరుగులు పూర్తి చేసుకున్నాడు.

ఈ క్రమంలో జయవర్దనే(25957) పేరిట ఉన్న రికార్డును విరాట్‌ కోహ్లి అధిగమించాడు. ఇక బంగ్లాతో మ్యాచ్‌లో గనుక ఈ  రైట్‌హ్యాండ్‌ బ్యాటర్‌ మొత్తంగా 77 పరుగులు సాధిస్తే.. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా 26 వేల పరుగుల మైలురాయిని చేరుకున్న క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పే అవకాశం ఉంటుంది. 

కాగా టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో 25 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. 

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన టాప్‌-5 బ్యాటర్లు
►సచిన్‌ టెండుల్కర్‌(ఇండియా)-34357
►కుమార్‌ సంగక్కర(శ్రీలంక)- 28016
►రిక్కీ పాంటింగ్‌(ఆస్ట్రేలియా)- 27483
►విరాట్‌ కోహ్లి(ఇండియా)- 25958*
►మహేల జయవర్ధనే(శ్రీలంక)- 25957

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement