ఇంగ్లండ్ బ్యాటర్ డానియెల్ వ్యాట్(PC: ICC)
Update: ఐసీసీ మహిళా వన్డే వరల్డ్‌కప్-2022 టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ ఫైనల్‌కు చేరుకుంది. సెమీ ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై 137 పరుగులతేడాతో విజయం సాధించింది. డేనియల్ వ్యాట్ అద్భుత ఇన్నింగ్స్‌తో తుదిపోరుకు అర్హత సాధించింది. ఫైనల్లో ఆస్ట్రేలియాతో ఇంగ్లండ్ తలపడనుంది.
ICC Women World Cup 2022 Eng Vs SA: ఐసీసీ మహిళా వన్డే వరల్డ్‌కప్-2022 టోర్నీలో భాగంగా ఇంగ్లండ్ బ్యాటర్ డానియెల్ వ్యాట్ అద్భుత ప్రదర్శన కనబరిచింది. 125 బంతుల్లో 129 పరుగులు చేసి సత్తా చాటింది. క్రైస్‌చర్చ్ వేదికగా వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో సెంచరీతో మెరిసింది. కాగా ప్రపంచకప్-2022 రెండో సైమీ ఫైనల్ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా తలపడుతున్నాయి.
ఇందులో భాగంగా టాస్ గెలిచిన సౌతాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ ఆరంభంలోనే ఓపెనర్ టామీ బీమౌంట్(7) వికెట్ కోల్పోయింది. వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ హీథర్‌నైట్ 19 బంతులు ఎదుర్కొని కేవలం ఒకే ఒక్క పరుగు చేసి పెవిలియన్ చేరింది. ఇలాంటి పరిస్థితుల్లో డానియెల్ వ్యాట్ పట్టుదలగా నిలబడింది. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది.
ఈ క్రమంలో శతకం పూర్తి చేసుకుంది. ఆమెకు ఇది రెండో వన్డే సెంచరీ కావడం విశేషం. ఇక వ్యాట్‌కు తోడు సోఫియా డంక్లే 60 పరుగులతో రాణించడంతో ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 293 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఇక దక్షిణాఫ్రికా బౌలర్లలో షబ్నిం ఇస్మాయిల్‌కు మూడు, మరిజానే క్యాప్‌నకు రెండు, అయబోంగా ఖాకాకు ఒకటి, మసబాట క్లాస్‌కు రెండు వికెట్లు దక్కాయి.
చదవండి: RCB Vs KKR: ఒక్కసారి మైదానంలోకి దిగితే అంతే.. ఆ సెలబ్రేషన్స్ అందుకే: హసరంగ
Comments
Please login to add a commentAdd a comment