ICC Women World Cup 2022: ఐసీసీ మహిళా వరల్డ్‌కప్-2022 తుదిపోరుకు డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ అర్హత సాధించింది. టోర్నీ ఆరంభంలో కాస్త తడబడ్డా అవరోధాలు అధిగమించి ఫైనల్‌కు చేరుకుంది. క్రైస్ట్‌చర్చ్ వేదికగా గురువారం జరిగిన రెండో సెమీ ఫైనల్లో దక్షిణాఫ్రికాను చిత్తుగా ఓడించి తుదిమెట్టుపై నిలిచింది. 137 పరుగుల తేడాతో గెలుపొంది ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో పోరకు సిద్ధమైంది.
అదరగొట్టిన వ్యాట్..
రెండో సెమీ ఫైనల్లో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుని ఇంగ్లండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రంమలో ఓపెనర్ టామీ బీమౌంట్(7) ఆదిలోనే అవుట్ కాగా.. క్రీజులోకి వచ్చిన కెప్టెన్ హీథర్‌నైట్ (19 బంతుల్లో ఒక పరుగు)సైతం ఎక్కువ సేపు నిలవలేకపోయింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మరో ఓపెనర్ డానియెల్ వ్యాట్ బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడింది.
125 బంతుల్లో 12 ఫోర్ల సాయంతో 129 పరుగులు చేసి జట్టును పటిష్ట స్థితిలో నిలిపింది. మరో బ్యాటర్ డంక్లే కూడా అర్ధ శతకం(50 పరుగులు)తో మెరవడంతో నిర్ణీత 50 ఓవర్లలో ఇంగ్లండ్ మహిళా జట్టు 8 వికెట్ల నష్టానికి 293 పరుగులు చేసింది.
దక్షిణాఫ్రికాకు చుక్కలు చూపించిన ఇంగ్లండ్ బౌలర్లు
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు లిజెలీ(2), లారా వొల్వార్డ్(0) పూర్తిగా నిరాశపరిచారు. వన్‌డౌన్‌లో వచ్చిన లారా గుడాల్, కెప్టెన్ సునే లాస్ వరుసగా 28, 21 పరుగులు సాధించారు. మిగతా బ్యాటర్లు కాసేపు పోరాడే ప్రయత్నం చేసినప్పటికీ ఇంగ్లండ్ బౌలర్లు వాళ్లకు అవకాశం ఇవ్వలేదు.
వరుసగా వికెట్లు తీస్తూ చెలరేగిపోయారు. ముఖ్యంగా సోఫీ ఎక్లెస్టోన్ 8 ఓవర్లలో కేవలం 36 పరుగులు ఇచ్చి ఏకంగా 6 వికెట్లు పడగొట్టింది. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా 38 ఓవర్లలో 156 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో ఇంగ్లండ్ విజయం ఖారారైంది. ఇంగ్లండ్ బౌలర్లలో సోఫీకి ఆరు, అన్యాకు రెండు, కేట్ క్రాస్‌కు ఒకటి, చర్లోట్ డీన్‌కు ఒక వికెట్ దక్కాయి. ఇక తన సెంచరీతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన డానియెల్ వ్యాట్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
ఐసీసీ మహిళా ప్రపంచకప్-2022 రెండో సెమీ ఫైనల్
దక్షిణాఫ్రికా వర్సెస్ ఇంగ్లండ్ మ్యాచ్ స్కోర్లు
ఇంగ్లండ్- 293/8 (50)
దక్షిణాఫ్రికా- 156 (38)
చదవండి: IPL 2022: ప్చ్.. వేలంలో పాల్గొనలేకపోయా.. మ్యాచ్‌లు చూస్తుంటే చిరాగ్గా ఉంది! నాకు ఛాన్స్ వస్తే..
Comments
Please login to add a commentAdd a comment