సాక్షి, హైదరాబాద్: తన సుదీర్ఘ చెస్ కెరీర్‌లో ఎంతో కాలంగా ఊరిస్తోన్న లక్ష్యాన్ని సాధించానని ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక తెలిపింది. స్పెయిన్‌లో జరిగిన ప్రపంచ మహిళల టీమ్ చాంపియన్‌షిప్‌లో హారిక, తానియా, వైశాలి, భక్తి కులకర్ణి, మేరీఆన్ గోమ్స్‌లతో కూడిన భారత జట్టు రజతం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మెగా ఈవెంట్ చరిత్రలో భారత్‌కు ఇదే తొలి పతకం. ‘2004 నుంచి టీమ్ ఈవెంట్స్‌లో ఆడుతున్నాను. గతంలో పలుమార్లు పతకానికి చేరువై దూరమయ్యాం.
ఒకట్రెండుసార్లు భావోద్వేగానికి లోనై ఏడ్చేశాను కూడా. ఈసారి మాత్రం అనుకున్నది సాధించాం. నా కెరీర్‌లో ఇది గొప్ప ఫలితం. మా పతకం భవిష్యత్‌లో మరిన్ని విజయాలకు నాంది పలుకుతుందని ఆశిస్తున్నాను. వ్యక్తిగతంగానూ నాకు ఈ టోర్నీ చిరస్మరణీంగా నిలిచింది. ఈ టోర్నీ మొత్తంలో 11 గేమ్‌ల్లో బరిలోకి దిగిన ఏకైక ప్లేయర్ నేనే. చివరకు అజేయంగా నిలిచి వ్యక్తిగత విభాగంలో రజత పతకం సాధించినందుకు ఆనందంగా ఉంది’ అని హారిక వ్యాఖ్యానించింది.
చదవండి: టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో భారత జట్టుకు కాంస్యం..
Comments
Please login to add a commentAdd a comment