
Courtesy: IPL Twitter
ఐపీఎల్-2022లో భాగంగా ఆదివారం(ఏప్రిల్10) లక్నో సూపర్‌జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 3 పరుగుల తేడాతో రాజస్తాన్ రాయల్స్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాగా యుజువేంద్ర చాహల్ నాలుగు కీలక వికెట్లు పడగొట్టి రాజస్తాన్ రాయల్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ఫీల్డ్‌లో ఎప్పుడూ ప్రశాంతంగా కన్పించే చాహల్.. ఈ మ్యాచ్‌లో మాత్రం కోపంతో ఊగిపోయాడు.
లక్నో ఇన్నింగ్స్ 18 ఓవర్ వేసిన చాహల్ ఐదో బంతిని ఫుల్ ఆఫ్ సైడ్ వేశాడు. అయితే ఆనూహ్యంగా అంపైర్ ఆ బంతిని వైడ్‌గా ప్రకటించాడు. కాగా రీప్లేలో బంతి లైన్ లోపల ఉన్నట్లు కనిపించింది. దీంతో అసహనానికి గురైన చాహల్ అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. అదే విధంగా అంపైర్ తీసుకున్న నిర్ణయం పట్ల కెప్టెన్ సంజూ శాంసన్ కూడా ఆసంతృప్తిగా ఉన్నట్లు కన్పించింది. కాగా తరువాతి బంతికే చమీరాను చాహల్ పెవిలియన్‌కు పంపాడు. ఇక దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
చదవండి: IPL 2022: ఐపీఎల్‌లో కేఎల్ రాహుల్ చెత్త రికార్డు.. తొమ్మిదేళ్ల తర్వాత!
— Vaishnavi Sawant (@VaishnaviS45) April 10, 2022