
టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌కు సెలక్టర్లు మరోసారి సెలక్టర్లు మొండి చేయి చూపించిన సంగతి తెలిసిందే. ఆసియాకప్, వన్డే ప్రపంచకప్‌కు చాహల్‌ను పట్టించుకోపోయిన సెలక్టర్లు.. తాజాగా ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు పరిగణలోకి తీసుకోలేదు. టీ20ల్లో అత్యధిక వికెట్ల తీసిన భారత బౌలర్‌గా ఉన్న చాహల్ పట్ల సెలక్టర్లు వ్యవహరిస్తున్న తీరు పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
చాహల్ చివరగా ఈ ఏడాది వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో భారత జట్టు తరపున కన్పించాడు. కాగా ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు టీమిండియాను ప్రకటించిన తర్వాత సోషల్ మీడియా ఖాతాలో స్మైలింగ్ ఎమోజీతో తన స్పందించిన చాహల్.. తాజా మరో క్రిప్టిక్ స్టోరీని పోస్ట్ చేశాడు.
"మనం కోసం ఎవరూ ఏమనుకున్నా లక్ష్యం దిశగా దూసుకుపోవడమే ఓ యోధుని నిజమైన బలమని" అర్ధం వచ్చేట్లుగా క్రిప్టిక్ స్టోరీని చాహల్ ట్విటర్‌లో షేర్ చేశాడు. కాగా 2016లో టీమిండియా తరుఫున టీ20ల్లో అరంగేట్రం చేసిన చాహల్.. 80 మ్యాచ్‌లు ఆడి 96 వికెట్లు పడగొట్టాడు. చాహల్ ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీ 2023 సీజన్‌లో హర్యానా తరుపున ఆడుతున్నాడు. ఉత్తరాఖండ్‌తో తొలి మ్యాచ్‌లో ఏకంగా 6 వికెట్లు పడగొట్టాడు. తన పది ఓవర్ల కోటాలో 26 పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు తీశాడు.
చదవండి: IND vs AUS: 'నువ్వు మా జట్టుపై ఎక్కువ సిక్సర్లు కొట్టావు'.. రోహిత్ శర్మపై సంజూ కీలక వ్యాఖ్యలు
See you at work. 🏏 pic.twitter.com/JNMbz5owKI
— Yuzvendra Chahal (@yuzi_chahal) November 24, 2023