Ind Vs Aus: Yuzvendra Chahal Beautiful Tribute To Wife Shuts Rumours - Sakshi
Sakshi News home page

Yuzvendra Chahal: భార్యపై ప్రేమను చాటుకున్న చహల్‌! అందమైన వీడియోతో వదంతులకు చెక్‌!

Published Thu, Sep 15 2022 3:48 PM | Last Updated on Thu, Sep 15 2022 4:26 PM

Ind Vs Aus: Yuzvendra Chahal Beautiful Tribute To Wife Shuts Rumours - Sakshi

భార్య ధనశ్రీ వర్మతో యజువేంద్ర చహల్‌(PC: Yuzvendra Chahal Instagram)

Yuzvendra Chahal- Dhanashree Verma Video Viral: టీమిండియా లెగ్‌ స్పిన్నర్‌ యజువేంద్ర చహల్‌ తన భార్య ధనశ్రీ వర్మపై ప్రేమను చాటుకున్నాడు. ‘‘అత్యంత శక్తిమంతమైన మహిళ.. తనే నా బలం’’ అంటూ సతీమణితో గడిపిన అందమైన క్షణాల తాలూకు దృశ్యాలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. ఈ వీడియో చూసిన ఫ్యాన్స్‌.. ‘రూమర్లకు పర్ఫెక్ట్‌ చెక్‌’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

విడిపోతున్నారంటూ వదంతులు!
కాగా టీమిండియా క్రికెటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ ఇచ్చిన పార్టీకి ధనశ్రీ ఒంటరిగా హాజరైన నేపథ్యంలో చహల్‌తో ఆమెకు విభేదాలంటూ వదంతులు వ్యాపించిన విషయం తెలిసిందే. ఆ పార్టీలో బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌తో దిగిన ఫొటో కారణంగా ధనశ్రీపై పెద్ద ఎత్తున ట్రోల్స్‌ వచ్చాయి. చహల్‌- ధనశ్రీ విడిపోబోతున్నారంటూ గాసిప్‌ రాయుళ్లు కథనాలు అల్లేశారు.

అందమైన వీడియోతో ముందుకు వచ్చిన చహల్‌!
ఈ నేపథ్యంలో చహల్‌ దంపతులు సోషల్‌ మీడియా వేదికగా ఇప్పటికే స్పష్టతనిచ్చారు. ఇలాంటివి నమ్మవద్దని ఈ భారత బౌలర్‌ అభిమానులకు విజ్ఞప్తి చేశాడు. తాజాగా మరోసారి.. వదంతులు వ్యాప్తి చేసిన వారికి కౌంటర్‌గా భార్యతో కలిసి ఉన్న వీడియోను పంచుకున్నాడు.

ఇక షేర్‌ చేసిన రెండు గంటల వ్యవధిలోనే నాలుగు లక్షలకు పైగా లైక్‌ సాధించిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. కాగా చహల్‌ టీ20 వరల్డ్‌కప్‌-2022కు ఎంపికైన విషయం తెలిసిందే. అంతకంటే ముందు స్వదేశంలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో భాగం కానున్నాడు. సెప్టెంబరు 20 నుంచి ఆసీస్‌తో ఆరంభం కానున్న టీ20 సిరీస్‌కు సన్నద్ధమవుతున్నాడు చహల్‌. ఇదిలా ఉంటే.. ధనశ్రీ వర్మ యూట్యూబర్‌గా, కొరియోగ్రాఫర్‌గా రాణిస్తున్నారు. వీరి వివాహం 2020లో అంగరంగ వైభవంగా జరిగింది.

చదవండి: బీసీసీఐకి వ్యతిరేకంగా నిరసన చేపట్టనున్న శాంసన్‌ ఫ్యాన్స్‌.. ఎప్పుడంటే?
T20 World Cup 2022: జట్టును ప్రకటించిన అఫ్గనిస్తాన్‌.. యువ బౌలర్‌ ఎంట్రీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement