
విద్యార్థుల్లో ఫుల్ జోష్
నెల్లూరు(టౌన్): ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలు గురువారంతో ముగిశాయి. ఈనెల ఒకటో తేదీన పరీక్షలు మొదలయ్యాయి. చివరిరోజు కెమిస్ట్రీ, కామర్స్ పరీక్షలు జరిగాయి. వీటికి జనరల్‌కు సంబంధించి 27,753 మందికి గానూ 26,961 మంది హాజరయ్యారు. 792 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ విభాగంలో 738 మందికి గానూ 634 మంది హాజరయ్యారు.104 మంది గైర్హాజరయ్యారు. ఆర్‌ఐఓ ఆదూరు శ్రీనివాసులు ఆత్మకూరులోని ప్రభుత్వ, ప్రియదర్శిని, బీఎస్‌ఆర్, వింజమూరులోని వైఆర్ వికాస్ జూనియర్ కళాశాలలను తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రాల నుంచి బయటకు వచ్చిన విద్యార్థులు కాగితాలను చింపి కేకలు వేశారు. హాస్టళ్లలో ఉంటున్న వారు ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్‌కు చేరుకుని సొంతూర్లకు బయలుదేరారు.

విద్యార్థుల్లో ఫుల్ జోష్

విద్యార్థుల్లో ఫుల్ జోష్

విద్యార్థుల్లో ఫుల్ జోష్

విద్యార్థుల్లో ఫుల్ జోష్