
ప్రభుత్వ ఆదేశాల మేరకు నిలిపివేశాం
గత ప్రభుత్వంలో
మెరుగైన సేవలు
పాడి రైతుల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంచార పశు వైద్య అంబులెన్స్ వ్యవస్థ ప్రవేశ పెట్టారు. అత్యాధునికంగా హైడ్రాలిక్ సిస్టమ్‌తో పశువులను నేరుగా అంబులెన్స్‌లోకి ఎక్కించి ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యసేవలు అందించి తిరిగి తీసుకువచ్చి దించే విధంగా వీటికి రూపకల్పన చేశారు. వీటి ద్వారా రైతులకు పైసా ఖర్చు లేకుండా ఇంటి వద్దనే వైద్యం అందేది. ఒక్కొక్క నియోజక వర్గానికి 2 చొప్పున కేటాయించారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మొదటి దఫా 9 వాహనాలు, రెండో దఫా మరో 10 వాహనాలను కేటాయించారు. దీంతో వేలాది మంది పశుపోషకులకు మేలు జరిగింది. ఈ సర్వీసు ప్రజాదరణ పొందింది. అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న ఈ సర్వీసులను నిర్వీర్యం చేయడంతో పాడిపై ఆధారపడే రైతులు ప్రభుత్వ తీరుపై ఆగ్రహంతో ఉన్నారు.
నేనేమి
చేశాను పాపం!
గ్రామీణ ప్రాంత ప్రజల ప్రధాన ఆదాయ వనరు వ్యవసాయం తర్వాత పాడిపరిశ్రమే. పల్లెలో రైతుల జీవన ప్రమాణాలు మెరుగు పడాలంటే పాడి, పంటలు ఎంతో ముఖ్యం. వ్యవసాయం కలిసి రాక పోయినా పాడి ద్వారా కుటుంబ పోషణకు ఇబ్బంది ఉండదు. అటువంటి పాడి పశువులకు అత్యవసర వైద్య సేవలను గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఇందు కోసం సంచార అంబులెన్స్‌లను నియోజకవర్గానికి రెండు చొప్పున ఏర్పాటు చేసింది. వీలైతే ఇంటి వద్దనే వైద్యం, మెరుగైన వైద్యం అవసరమైతే ఆస్పత్రికి తరలించేందుకు వీలుగా అంబులెన్స్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం ఈ సేవలను కూటమి ప్రభుత్వం నిలిపివేసింది.
ఉదయగిరి: పశువుల అత్యవసర వైద్య సేవలకు కూటమి ప్రభుత్వం మంగళం పాడుతోంది. గత ప్రభుత్వంలో ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన ఒక్కొక్క పథకాన్ని అటకెక్కిస్తొంది. ఆయా కార్యక్రమాల ప్రయోజనాన్ని పరిగణలోకి తీసుకోకుండా కక్ష పూరితంగా పథకాలను నిర్వీర్యం చేస్తోంది. అందులో భాగంగా మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఇంటి వద్దనే పశువులకు అత్యవసర వైద్య సేవలు అందించే సంచార పశువైద్య అంబులెన్స్‌ల సర్వీసులకు స్వస్తి పలుకుతోంది. తాజాగా ఈ నెల మొదటి నుంచి ఉమ్మడి జిల్లాలో 9 అంబులెన్స్ సర్వీసులు ఆగిపోయాయి. అందులో పని చేసే వైద్యులు, టెక్నీషియన్, ఫార్మసిస్టులు, పైలట్‌లను ఇంటికి పంపింది.
కూటమి సర్కార్ కక్ష ధోరణి
చంద్రబాబు సర్కార్ పాడిపై ఆధారపడే పశుపోషకులను వదలడం లేదు. వైఎస్సార్‌ీసీపీ ప్రభుత్వం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 2021లో మొదటి విడతలో 9, రెండో విడతలో 10 వాహనాలు మంజూరు చేసింది. ఒక్కొక్క వాహనంలో వైద్యులు, టెక్నీషియన్, ఫార్మసిస్టులు, పైలట్ కలిపి నలుగురు ఉంటారు. మారుమూల గ్రామాల్లోనూ పశువులకు అత్యవసర వైద్య సేవలు అవసరమైతే 1962 టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేస్తే అంబులెన్స్‌లు నేరుగా ఇంటికి వెళ్లి వైద్య సేవలందిస్తాయి. వీటి నిర్వహణ రాష్ట్ర వ్యాప్తంగా జీవీకే ఫౌండేషన్‌కు అప్పగించింది. దీనికి గత నెలలో గడుపు ముగిసింది. దీంతో మార్చి 1వ తేదీ నుంచి మొదటి ఫేజ్‌లో మంజూరైన 9 అంబులెన్స్‌లు నిలిపి వేసి అందులో పనిచేసే వారిని ఇంటికి పంపారు. కారణంగా పశు వైద్యసేవలు ఆగిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సర్కార్ వైఖరిపై మండి పడుతున్నారు.
సంచార అంబులెన్స్‌ల నిలిపివేత
పాడి రైతులకు శాపంగా పరిణమించిన ప్రభుత్వ నిర్ణయం
వైద్యులు, టెక్నీషియన్, ఫార్మసిస్టులు, పైలట్ కొలువులు గోవిందా
గత ప్రభుత్వ పథకాలపై కూటమి సర్కార్ కక్ష
ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రస్తుతం మొదటి ఫేజ్‌లో ఉన్న 9 వాహనాలను నిలిపివేశాం. వీటికి నిర్వహణ ఏజెన్సీ కాల పరిమితి పూర్తి కావడంతో ఫిట్‌నెస్ పరిశీలన చేయమన్నారు. అది కూడా చేస్తున్నాం. తదిపరి ప్రభుత్వ అదేశాల మేరకు తగిన చర్యలు తీసుకుంటాం.
– రమేష్‌నాయక్, జేడీ పశుసంవర్థక శాఖ