
ఇదేనా ప్రశాంతమ్మ పాలన?
పచ్చనాయకుడు
చెప్పినట్లు విని వైఎస్సార్‌సీపీ
నాయకులపై
కేసులు పెడితే
పోలా
సాక్షి, టాస్క్‌ఫోర్స్: బసవారెడ్డి శంకయ్య నుంచి రేబాల దశరథరామిరెడ్డి, వెంకురెడ్డి, పెళ్లకూరు రామచంద్రారెడ్డి, నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి వంటి రాజకీయ ఉద్దండులు కోవూరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. వర్గ రాజకీయాలకు దూరంగా పాలన సాగించి.. ప్రజాదరణ పొందారు. ఇటువంటి రాజకీయ చైతన్యంతోపాటు ప్రశాంత వాతావరణం ఉండే కోవూరులో వేమిరెడ్డి ప్రశాంతమ్మ పాలనలో రెడ్‌బుక్ రాజ్యాంగం, రౌడీ రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి. వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి సతీమణిగా రాజకీయాల్లోకి వచ్చిన ప్రశాంతిరెడ్డి తన తొమ్మిది నెలల పాలనలో అశాంతి వాతావరణాన్ని ప్రేరేపిస్తున్నారనే విమర్శలు రాజకీయంగా దూమారం రేపుతున్నాయి.
వైఎస్సార్‌సీపీ
నాయకులు
అధికార పార్టీ నేతల
రెడ్‌బుక్ రాజ్యాంగం
అక్రమాలు ఎత్తిచూపితే కేసులతో
వేధింపులు
వైఎస్సార్‌సీపీ నేత వీరి చలపతిరావు,
అనుచరులపై కేసులు
బూతు పురాణాలతో రెచ్చిపోతున్న
పచ్చనేతలు
రాజకీయ చైతన్యానికి, విలువలకు కోవూరు నియోజకవర్గం మారు పేరు. ఇక్కడి నుంచి ఎన్నికై దేశ రాజకీయాల్లో ప్రాతినిధ్యం వహించిన గొప్ప రాజనీతిజ్ఞులున్నారు. దాదాపు ఏడు దశాబ్దాలుగా రాజకీయ విద్వేషాలకు, రాగద్వేషాలకు తావులేని గడ్డపై రెడ్‌బుక్ రాజ్యమేలుతోంది. జిల్లాలో చరిత్ర కలిగిన కుటుంబం నుంచి మహిళా నేతగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అనతి కాలంలోనే వర్గ రాజకీయాలు, కక్షలకు పురిగొల్పుతూ తెర వెనుక నుంచి ఆజ్యం పోస్తూ కొత్త సంప్రదాయానికి తెరతీస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.