
పొలాన్ని చూపాలని కాళ్లరిగేలా తిరుగుతున్నా..
మా తండ్రి సుబ్బరాయుడు మిలిటరీలో జీపు డ్రైవర్. ఆయనకు నెల్లూరు పడారుపల్లిలో 5 ఎకరాలు ప్రభుత్వం ఇచ్చింది. అయితే అది ప్రభుత్వ అవసరాలకు జానకమ్మ కలెక్టర్‌గా ఉన్నప్పుడు తీసుకుని పొదలకూరు తహసీల్దార్ వద్దకు పంపారు. అక్కడి తహసీల్దార్ మండలంలోని ఆల్తుర్తి వద్ద తనకు 5 ఎకరాలు కండలేరు కాలువ కింద కేటాయించి పట్టా ఇచ్చారు. పాస్ బుక్స్ ఇవ్వాలని 2016 నుంచి తహసీల్దార్ చుట్టూ, కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నా ఇప్పటి వరకు ఇవ్వలేదు. న్యాయం కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నాను.
– తడకలూరు సోమశేఖరయ్య,
ప్రశాంతినగర్, మైపాడురోడ్డు
●