ప్రిన్సిపల్స్‌తో సమావేశం నేడు | - | Sakshi
Sakshi News home page

ప్రిన్సిపల్స్‌తో సమావేశం నేడు

Published Thu, Apr 10 2025 12:17 AM | Last Updated on Thu, Apr 10 2025 12:17 AM

ప్రిన్సిపల్స్‌తో  సమావేశం నేడు

ప్రిన్సిపల్స్‌తో సమావేశం నేడు

నెల్లూరు (టౌన్‌): జిల్లాలోని అన్ని యాజమాన్యాల జూనియర్‌ కళాశాలల ప్రిన్సిపల్స్‌తో గురువారం సమావేశం నిర్వహించనున్నట్లు ఆర్‌ఐఓ ఆదూరు శ్రీనివాసులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక డీకేడబ్ల్యూలో ఉదయం 10.30 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందన్నారు. ఈ సమావేశంలో కళాశాలల యూడైస్‌ ప్లస్‌ డేటా, మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా కళాశాలల్లో ఈగల్‌ క్లబ్‌లు ఏర్పాటు చేయడం, 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రథమ సంవత్సరంలో ప్రవేశ పెడుతున్న సంస్కరణలు, అడ్మిషన్లు, అకడమిక్‌ షెడ్యూళ్లను అమలు చేయడం తదితర అంశాలపై చర్చించనున్నట్లు పేర్కొన్నారు. అన్ని కళాశాలల ప్రిన్సిపల్స్‌ పూర్తి సమాచారంతో సమావేశానికి రావాలన్నారు.

డీసీపల్లిలో 405

పొగాకు బేళ్ల విక్రయం

మర్రిపాడు: డీసీపల్లి పొగాకు బోర్డు వేలం కేంద్రంలో బుధవారం 405 పొగాకు బేళ్లను విక్రయించినట్లు వేలం నిర్వహణాధికారి రాజశేఖర్‌ తెలి పారు. వేలానికి 472 బేళ్లు రాగా వాటిలో 405 బేళ్లను విక్రయించామని, మిగిలిన బేళ్లను వివిధ కారణాలతో తిరస్కరించినట్లు తెలిపారు. వేలంలో 53285.5 కిలోల పొగాకును విక్రయించగా రూ.1,39,64,286 వ్యాపారం జరిగింది. కిలోకు గరిష్ట ధర రూ.280, కనిష్ట ధర రూ.230లుగా లభించింది. సగటున రూ.262.07 ధర నమోదైంది. వేలంలో 11 కంపెనీలకు చెందిన వ్యాపార ప్రతినిధులు పాల్గొన్నారు.

కిలో పొగాకు గరిష్ట ధర రూ.280

కలిగిరి: కలిగిరి పొగాకు వేలం కేంద్రంలో బుధవారం కిలో పొగాకు గరిష్ట ధర రూ.280 లభించింది. జనరల్‌ క్లస్టర్‌ రైతులు 267 పొగాకు బేళ్లను అమ్మకానికి తీసుకు రాగా 214 పొగాకు బేళ్లను కొనుగోలు చేయగా వివిధ కారణాలతో 53 బేళ్లను కొనుగోలుకు తిరస్కరించారు. వేలం నిర్వహాణాధికారి వి.మహేష్‌కుమార్‌ మాట్లాడుతూ కిలో పొగాకుకు గరిష్ట ధర రూ.280, కనిష్ట ధర రూ.230, సగటున కిలోకు రూ.258.89 ధర లభించిందన్నారు. వేలంలో 10 కంపెనీలు పాల్గొన్నాయని తెలిపారు.

మున్సిపాలిటీల్లో

పార్కుల అభివృద్ధి

మంత్రి నారాయణ

నెల్లూరు సిటీ: గ్రీన్‌ కార్పొరేషన్‌ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో పార్కులను అభివృద్ధి చేస్తామని రాష్ట్ర మున్సిప ల్‌ శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. నగరంలోని కలెక్టరేట్‌ ఎదురుగా ఆధునికీకరించిన మహబూబ్‌ఖాన్‌ పార్కును బుధవారం నారాయణ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఈనెల 23 నుంచి విద్యార్థులకు వేసవి సెలవులు ఉన్న నేపథ్యంలో ఆ లోపుగా నగరంలోని అన్ని పార్కులను అభివృద్ధి చేస్తామన్నారు. పెండింగ్‌లో ఉన్న మంచినీటి వసతి సౌకర్యం, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పనులను రూ.165 కోట్ల నిధులతో ఆరు నెలల లోపు పూర్తి చేస్తామన్నారు. ఉయ్యాల కాలువ, జాఫర్‌సాహెబ్‌ కాలువలకు ఇరువైపులా గోడలు నిర్మించి, స్లాబ్‌ వేసేందుకు రూ.50 కోట్ల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. అనంతరం వీఆర్‌ హైస్కూల్‌ ఆధునికీకరణ పనులు మంత్రి నారాయణ పరిశీలించారు. వీఆర్‌ హైస్కూల్‌ను ఆధునిక హంగులతో అభివృద్ధి చేసి రాబోవు విద్యా సంవత్సరంలో ప్రారంభించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ సూర్యతేజ, డిప్యూటీ మేయర్‌ రూప్‌కుమార్‌యాదవ్‌, అదనపు కమినర్‌ నందన్‌, హెల్త్‌ ఆఫీసర్‌ చైతన్య, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ తాళ్లపాక అనురాధ తదితరులు పాల్గొన్నారు.

వాహనం ఢీకొని జింక మృతి

వెంకటాచలం: గుర్తుతెలియని వాహనం ఢీకొని జింక మృతి చెందిన ఘటన మండలంలోని సరస్వతీనగర్‌ సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం జరిగింది. దాహార్తి కోసం రోడ్డు దాటుతున్న జింకను గూడూరు వైపు నుంచి నెల్లూరు వైపు వెళ్లే గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే జింక మృతి చెందింది. స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.

ఇద్దరు విద్యార్థుల డిబార్‌

వెంకటాచలం: వీఎస్‌యూ అనుబంధ కళాశాలల్లో బుధవారం నిర్వహించిన డిగ్రీ రెండో సెమిస్టర్‌ పరీక్షల్లో ఇద్దరు విద్యార్థులు డిబార్‌ అయ్యారని ఎగ్జామ్స్‌ నిర్వహణాధికారి డాక్టర్‌ ఆర్‌.మధుమతి తెలిపారు. మొత్తం 8,464 మంది విద్యార్థులకు 7,940 మంది హాజరు కాగా 524 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. నెల్లూరు నగరంలోని వివేకనందా, జెనెక్స్‌ డిగ్రీ కళాశాలలకు చెందిన ఒక్కో విద్యార్థి డిబార్‌ అయ్యారని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement