
అత్యాధునిక పరిజ్ఞానంతో భారతి సిమెంట్ తయారీ
కావలి: అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో భారతి సిమెంట్ తయారవుతుందని సేల్స్ ఆఫీసర్ (మార్కెటింగ్) బాబ్ జాన్ తెలిపారు. అల్లూరు మండలం ఇస్కపల్లి గ్రామంలో లక్ష్మి ఏజెన్సీ సహకారంతో భారతి సిమెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో భవన నిర్మాణ మేసీ్త్రలు, కార్మికులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కట్టడాలు పూర్తి నాణ్యతతో దీర్ఘకాలం ఉండేందుకు భారతి సిమెంట్ దోహదపడతుందని చెప్పారు. ఈ సిమెంట్‌తో వేసిన శ్లాబుల్ని ఏడు రోజుల అనంతరం తమ కంపెనీ ప్రతినిధులు వచ్చి నాణ్యత పరీక్షలు చేస్తారన్నారు. ఇందుకోసం డీలర్ ద్వారా తమకు సమాచారం అందించాలని కోరారు. మేసీ్త్రలు, కార్మికులకు రూ.లక్ష చొప్పున ఉచిత బీమా సదుపాయం కల్పించి బాండ్లను అందజేశారు. కార్యక్రమంలో పవన్ ఆదిత్య హార్డ్‌వేర్ షాపు యాజమాని పవన్ పాల్గొన్నారు.
సమస్యలు
పరిష్కరించాలని డిమాండ్
రాపూరు: ‘ఆర్టీసీలో పనిచేసే కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. పాత వైద్య విధానాన్ని అమలు చేయాలి’ అని ఎన్‌ఎంయూఏ జోనల్ కార్యదర్శి లుక్సన్ డిమాండ్ చేశారు. రాపూరు ఆర్టీసీ డిపో వద్ద గురువారం ర్యాలీ, గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019 సర్క్యులర్‌ను అమలు చేయాలన్నారు. పదోన్నతులు కల్పించాలన్నారు. నైటవుట్ అలవెన్స్ రూ.400 ఇవ్వాలని, గ్యారేజ్‌లో సరైన స్పేర్‌పార్టులు అందించాలని కోరారు. కార్యక్రమంలో కార్యదర్శి రమణయ్య, గ్యారేజ్ కార్యదర్శి సుధాకర్, అధ్యక్షుడు హరిబాబు, సీసీఎస్ డెలిగేట్ నిస్సార్ అహ్మద్, భాస్కర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
పద్మ అవార్డులకు
దరఖాస్తుల ఆహ్వానం
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): భారత ప్రభుత్వం గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా అందజేసే పద్మ – 2026 అవార్డుల కోసం క్రీడాకారులు, క్రీడా ప్రోత్సాహకుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి యతిరాజ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల వారు www. padmaawards.gov.in వెబ్‌సైట్‌లో పొందుపరిచిన మార్గదర్శకాలకు అనుగుణంగా దరఖాస్తులను నింపి వర్డ్, పీడీఎఫ్‌లను ఫార్మాట్లలో sportsinap@gmail.com, incentives. schemes@gmail.comకు మే 26వ తేదీలోగా ఈమెయిల్ పంపాలన్నారు. ఇతర వివరాలకు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.
అధికారులతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్
నెల్లూరు రూరల్: రాష్ట్ర సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ వివిధ అంశాలపై గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టరేట్‌లోని శంకరన్ హాల్ నుంచి జేసీ కె.కార్తీక్ ఇతర అధికారులు ఈ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని సీఎస్ ఆదేశించారు. ప్రభుత్వ వైద్యశాలను తనిఖీలు చేయాలన్నారు. ఆర్‌డబ్ల్యూఎస్, విద్యుత్ ఎస్‌ఈలు వెంకటరమణ, విజయన్, డీఆర్‌డీఏ పీడీ నాగరాజకుమారి తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు దాటుతుండగా..
● బొలెరో ఢీకొని వ్యక్తి మృతి
మర్రిపాడు: మండలంలోని బాట సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నల్లిపోగు చెన్నయ్య (55) అనే వ్యక్తి మృతిచెందాడు. గురువారం పోలీసులు వివరాలు వెల్లడించారు. చెన్నయ్య రోడ్డు దాటుతుండగా బొలెరో వేగంగా వెళ్తూ ఢీకొట్టింది. దీంతో అతను చనిపోయాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై శ్రీనివాసరావు వివరాలు తెలుసుకున్నారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని బ్రాహ్మణపల్లి టోల్‌ప్లాజా వద్ద పట్టుకున్నట్లు ఎస్సై తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వెల్లడించారు.

అత్యాధునిక పరిజ్ఞానంతో భారతి సిమెంట్ తయారీ

అత్యాధునిక పరిజ్ఞానంతో భారతి సిమెంట్ తయారీ