
డీసీపల్లిలో 524 పొగాకు బేళ్ల విక్రయం
మర్రిపాడు: మండలంలోని డీసీపల్లి పొగాకు బోర్డు వేలం కేంద్రంలో 524 పొగాకు బేళ్లను విక్రయించినట్లు వేలం నిర్వహణాధికారి రాజశేఖర్ తెలిపారు. వేలానికి 745 బేళ్లు రాగా 524 బేళ్లను విక్రయించామని, మిగిలిన బేళ్లను వివిధ కారణాలతో తిరస్కరించినట్లు తెలిపారు. వేలంలో 68174.7 కిలోల పొగాకును విక్రయించగా రూ.17928524.40 వ్యాపారం జరిగింది. కిలో గరిష్ట ధర రూ.280 కాగా, కనిష్ట ధర రూ.220 లభించింది. సగటు ధర రూ.262.98గా నమోదైంది. వేలంలో 11 కంపెనీల వ్యాపార ప్రతినిధులు పాల్గొన్నారు.
బ్యారేజీ పెండింగ్ పనులకు
ప్రతిపాదనలు పంపండి
సంగం: సంగం బ్యారేజీకి సంబంధించి పెండింగ్‌లో ఉన్న పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు చీఫ్ ఇంజినీర్ వరప్రసాద్‌రావు, ఎస్‌ఈ దేశ్‌నాయక్ సూచించారు. శనివారం వారు బ్యారేజీని సందర్శించి మిగిలిన పనుల గురించి ఆరా తీశారు. అవి త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈఈలు అనిల్ కుమార్‌రెడ్డి, నాగరాజు, డీఈలు విజయరామిరెడ్డి, శ్రీనివాసులరెడ్డి, పెంచలయ్య, ఏఈలు వినయ్, మల్లికార్జున, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.
బయో మైనింగ్
యూనిట్ ప్రారంభం
నెల్లూరు సిటీ: జిగ్మా గ్లోబల్ ఎన్విరాన్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఏర్పాటు చేసిన బయో మైనింగ్ యూనిట్‌ను మంత్రి నారాయణ శనివారం స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ డంపింగ్ యార్డ్‌లో చెత్తను ఈ ప్రక్రియ ద్వారా వేరు చేయడం సాధ్యపడుతుందన్నారు. అనంతరం అల్లీపురం డంపింగ్ యార్డ్‌ను సందర్శించారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ అనిల్‌కుమార్‌రెడ్డి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చైర్మన్ కృష్ణయ్య, కార్పొరేషన్ ఇన్‌చార్జి కమిషనర్ నందన్, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, నెల్లూరు నగర కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ రూప్‌కుమార్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
పోలీసుల విస్తృత తనిఖీలు
నెల్లూరు (క్రైమ్): నేర నియంత్రణ చర్యల్లో భాగంగా పోలీసులు నగరంలో తనిఖీలు ముమ్మరం చేశారు. శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్లవారు జాము వరకు ప్రధాన కూడళ్లతోపాటుగా జాతీయ రహదారి ప్రవేశ, నిష్క్ర మణ, శివారు ప్రాంతాల్లో ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. రికార్డులు, నంబరు ప్లేట్లు లేని వాహనాలను స్వాధీనం చేసుకుని స్టేషన్లకు తరలించారు. మద్యం మత్తులో నేరాలు, ప్రమాదాలు జరుగుతుండడంతో అన్ని కూడళ్లల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించి నిబంధనలు పాటించని వాహనదారులపై భారీగా జరిమానాలు విధిస్తున్నారు. బహిరంగంగా మద్య సేవనం చేస్తున్న మందుబాబులపై కేసులు నమోదు చేస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వేలి ముద్రలను పోలీసు డేటాబేస్‌తో పరిశీలించడంతోపాటు పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. పోలీసు అధికారులు మాట్లాడుతూ పాతనేరస్తులు, రౌడీషీటర్లు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా పెంచామన్నారు. నేర నియంత్రణకు తాము తీసుకుంటున్న చర్యలకు నగర ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఈ తనిఖీల్లో చిన్నబజారు, సంతపేట, దర్గామిట్ట, బాలాజీనగర్ ఇన్‌స్పెక్టర్లు చిట్టెం కోటేశ్వరరావు, దశరథరామారావు, రోశయ్య, కె.సాంబశివరావు, ట్రాఫిక్ పోలీసు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

డీసీపల్లిలో 524 పొగాకు బేళ్ల విక్రయం

డీసీపల్లిలో 524 పొగాకు బేళ్ల విక్రయం