
ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితం
రాపూరు: ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితమని రాపూరు ఆర్టీసీ డిపో ఎస్‌టీఐ బహీర్ అహ్మద్ అన్నారు. రాపూరు ఆర్టీసీ డిపో నుంచి వెంకటగిరి, గూడూరు మార్గంలో రాకపోకలు సాగించిన ప్రయాణికులకు సంబంధించి లక్కీ డ్రా తీశారు. విజేతలకు ఆదివారం బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ బస్సులో ప్రయాణించే వారిని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. బస్సు దిగే సమయంలో టికెట్‌పై ఫోన్ నంబర్, చిరునామా రాసి బాక్స్‌లో వేస్తే 15 రోజులకు లక్కీ డ్రా తీసి నలుగురిని ఎంపిక చేసి బహుమతులు అందిస్తున్నట్లు వివరించారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.
కండలేరులో
45.838 టీఎంసీలు
రాపూరు: కండలేరు జలాశయంలో ఆదివారం నాటికి 45.838 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ విజయకుమార్‌రెడ్డి తెలిపారు. సత్యసాయి గంగ కాలువకు 1,040, పిన్నేరు కాలువకు 5, లోలెవల్ కాలువకు 50, హైలెవల్ కాలువకు 30, మొదటి బ్రాంచ్ కాలువకు 10 క్యూసెక్కుల వంతున నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.
కాలువలోకి
దూసుకెళ్లిన కారు
● ఐదుగురు ప్రయాణికులు సురక్షితం
మనుబోలు: మండల పరిధిలోని వడ్లపూడి గ్రామ సమీపంలో ఆదివారం కారు అదుపుతప్పి కనుపూరు కాలువలోకి దూసుకెళ్లింది. అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డారు. స్థానికుల కథనం మేరకు.. పొదలకూరు మండలం బిరదవోలు పంచాయతీ రాజుపాళెం గ్రామానికి చెందిన అట్ల రమణారెడ్డి మూడు రోజుల క్రితం కొత్త కారు కొనుగోలు చేశాడు. శనివారం కుటుంబ సభ్యులతో గొలగమూడికి వెళ్లి పూజ చేయించాడు. రాత్రి నిద్ర చేసిన కుటుంబం ఆదివారం ఉదయం స్వగ్రామానికి బయలుదేరింది. వడ్లపూడి మలుపులో పిట్టగోడ లేని వంతెన వద్ద కారు అదుపుతప్పి కనుపూరు కాలువలోకి దూసుకెళ్లింది. అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. క్రేన్‌తో కారును బయటకు తీశారు.
ప్రజలకు నిజాల్ని
వివరించాలి
● ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి
నెల్లూరు రూరల్: ‘ప్రధాని నరేంద్రమోదీ పాలనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని బీజేపీ కార్యకర్తలు తిప్పి కొట్టాలి. ప్రజలకు నిజాలు వివరించాలి’ అని ఆదోని ఎమ్మెల్యే, బీజేపీ నేత డాక్టర్ పీవీ పార్థసారథి అన్నారు. నెల్లూరు నగరంలోని గోమతి నగర్‌లో ఉన్న ఇంద్రావతి మినీ ఫంక్షన్ హాల్లో ఆదివారం మేధావుల సదస్సు నిర్వహించారు. భారతరత్న అంబేడ్కర్ జయంతిని జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేడ్కర్‌ను కాంగ్రెస్ అవమానించిందన్నారు. కాంగ్రెస్ న్యాయవ్యవస్థను తమ స్వప్రయోజనాలకు వాడుకుందన్నారు. నిజాయితీ గల న్యాయమూర్తులను బదిలీల పేరుతో వేధించిందన్నారు. నేతలు వంశీధర్‌రెడ్డి, సన్నపురెడ్డి సురేష్‌రెడ్డి, కందికట్ల రాజేశ్వరి, విల్సన్, ఏవీ రెడ్డి, సందీప్ కిషన్ తదితరులు పాల్గొన్నారు.

ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితం

ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితం