మాట్లాడుతున్న ఎమ్మెల్యే శంక నారాయణ
శ్రీ సత్యసాయి: ఎంతో క్రమశిక్షణ ఉన్న వైఎస్సార్‌సీపీని అభాసుపాలు చేయాలని చూస్తే సహించబోమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, పెనుకొండ ఎమ్మెల్యే మాలగుండ్ల శంకరనారాయణ హెచ్చరించారు. సోమవారం రేణుకానగర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ...గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనేందుకు గుడ్డం నాగేపల్లికి వెళుతున్న తనపై జరిగిన దాడిని ఖండించారు.
స్వప్రయోజనాలకు సహకరించలేదన్న అక్కసుతో ఈదులబళాపురానికి చెందిన నాగభూషణరెడ్డి తనపై, తన కుటుంబసభ్యులపై, పార్టీ కార్యక్రమాలపై రెచ్చగొట్టేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టింగ్‌లు పెట్టడం సహించరానిదన్నారు. దాడితో స్ధానిక ప్రజలకు సంబంధం లేదని, గోరంట్ల, హిందూపురం ప్రాంతాల నుంచి తన అనుచరులను పిలిపించుకుని కాన్వయ్‌ను అడ్డుకున్నారని పేర్కొన్నారు.
పార్టీకి నష్టం చేకూర్చాలనుకునేవారు ఎంతటి వారైనా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. నాగభూషణరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయనున్నట్లు ఆయన తెలిపారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ సోమందేపల్లి మండల కన్వీనర్ నారాయణరెడ్డి, మాజీ కన్వీనర్ వెంకటరత్నం, జెడ్పీటీసీ సభ్యుడు అశోక్, ఎస్సీ సెల్ నాయకులు గజేంద్ర, ఈశ్వర్, కంబాలప్ప, సర్పంచ్‌లు రామాంజనేయులు, జిలాన్‌ఖాన్, సోము, కిష్టప్ప పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment