పరిహాసంగా కూటమి పాలన
హిందూపురం: కూటమి ప్రభుత్వ పాలన పరిహాసంగా మారింది. అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలో వచ్చిన కూటమి ప్రభుత్వం మహిళలు, రైతులు, కూలీలు, విద్యార్థులు ఇలా అన్ని వర్గాలను మోసం చేసింది’ అని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ ధ్వజమెత్తారు. హిందూపురం వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి టీఎన్.దీపికతో కలిసి పట్టణంలోని పార్టీ ఆఫీసు వద్ద ఉషశ్రీచరణ్ మీడియాతో మాట్లాడారు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తామని కూటమి నాయకులు ఎన్నికలకు ముందు ఊదరగొట్టారన్నారు. అయితే గద్దెనెక్కిన తర్వాత సూపర్‌సిక్స్ హామీలు అమలు చేయలేమని ప్లేటు ఫిరాయించడం దారుణమన్నారు.
కేజీబీవీల్లోనూ అవినీతి..
కేజీబీవీ స్కూల్‌లో పిల్లలకు అరకొర భోజనాలు అందిస్తున్నారని, సరకుల సరఫరాల్లో అవకతవకలు జరుగుతున్నాయని ఉషశ్రీచరణ్ పేర్కొన్నారు. హిందూపురానికి చెందిన ఓ వ్యక్తి కేజీబీవీ స్కూల్స్‌కు సరుకులు సరఫరా చేస్తూ నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా సరుకులు కూడా తక్కువ ఇస్తున్నట్లు బయట పడిందన్నారు. మంచి భవిష్యత్ ఉంటుందని తల్లిదండ్రులు వారి పిల్లలను కేజీబీవీల్లో చేర్పిస్తే అక్కడ కూడా అవినీతికి తెరతీసి విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికై నా దీనిపై విచారణ చేపట్టి సంబంధిత కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బలరామిరెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కురుబ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్‌ఏ శివ, జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడు మహేష్ గౌడ్, శ్రీరాంరెడ్డి, జిల్లా స్పోక్‌పర్సన్ శివశంకర్‌రెడ్డి పాల్గొన్నారు.
సాధ్యంకాని హామీలిచ్చి
ఇప్పడు ప్లేటు ఫిరాయిస్తారా?
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు
ఉషశ్రీచరణ్
Comments
Please login to add a commentAdd a comment