కార్పొరేషన్‌ రుణాలకు దరఖాస్తుల ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

కార్పొరేషన్‌ రుణాలకు దరఖాస్తుల ఆహ్వానం

Published Fri, Jan 31 2025 12:46 AM | Last Updated on Fri, Jan 31 2025 12:46 AM

కార్పొరేషన్‌ రుణాలకు దరఖాస్తుల ఆహ్వానం

కార్పొరేషన్‌ రుణాలకు దరఖాస్తుల ఆహ్వానం

ప్రశాంతి నిలయం: బీసీ కార్పొరేషన్‌ రుణాలకు దరఖాస్తు చేసుకోవాలని బీసీ కార్పొరేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సుబ్రహ్మణ్యం ఓ ప్రకటనలో తెలిపారు. బీసీ, బ్రాహ్మణ, ఈబీసీ, కమ్మ, క్షత్రియ, రెడ్డి, వైశ్య, కాపు కార్పొరేషన్‌ల ద్వారా జిల్లాకు రూ.42.86 కోట్లతో 2004 యూనిట్లు ఈ ఆర్థిక సంవత్సరానికి మంజూరయ్యాయని పేర్కొన్నారు. బీసీ కార్పొరేషన్‌కు 1472, బ్రాహ్మణ కార్పొరేషన్‌కు 11, ఈబీసీ కార్పొరేషన్‌కు 86, కమ్మ కార్పొరేషన్‌ కు 46, క్షత్రియ కార్పొరేషన్‌కు 13, రెడ్డి కార్పొరేషన్‌కు 24, వైశ్య కార్పొరేషన్‌కు 17, కాపు కార్పొరేషన్‌కు 345 యూనిట్లు మంజూరయ్యయని వివరించారు. జిల్లాలో స్థిర నివాసం కలిగిన ఆయా వర్గాల వారు ఫిబ్రవరి 7వ తేదీ లోపల ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 21 నుంచి 60 సంవత్సరాల్లోపు వారు అర్హులని, కుల ధ్రువీకరణపత్రం, రేషన్‌ కార్డు, వయస్సు ధ్రువీకరణపత్రం, ఆధార్‌ కార్డు, బ్యాంక్‌ ఖాతాలతో ఓపీఓ బీఎంఎంఎస్‌ వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement